బయ్యారం: యూరియా కోసం వెళ్తుండగా ఆటో బోల్తా పడి రైతులు గాయాల పాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం సరిహద్దులు చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బయ్యారం మండలంలోని ఉప్పలపాడు సొసైటీ సబ్ సెంటర్లో యూరియా పంపిణీ జరుగుతుండగా తెల్లవారుజామున గురిమల్ల గ్రామానికి చెందిన రైతులు బయలుదేరారు. ఈ క్రమంలో మహబూబాద్ బయ్యారం సరిహద్దు గ్రామమైన కంబాలపల్లి శివారులో..ఆటో బోల్తా పడింది.
ఆటోలో 12 మంది ప్రయాణిస్తుండగా డ్రైవర్ తో పాటు ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఐదుగురికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. వీరిని హుటాహుటిన 108లో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కి తరలించారు. క్షతగాత్రులను హుటాహుటిన రెండు 108 అంబులెన్సులలో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతున్న రైతులను ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు అడిగోస పడుతున్నారని, టిబీఆర్ఎస్ పాలనలో రైతులు రాజుల బతికారని గుర్తు చేశారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అధైర్య పడుద్దని భరోసానిచ్చారు.