చెన్నారావుపేట, జూలై 27: విద్యుదాఘాతం తో రైతు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు తుమ్మలపెల్లి రాజిరెడ్డి(50) సరళకుంట చెరువు సమీపంలోని తన పొలం లో ఇటీవల నాటు వేశాడు. పొలానికి నీరు పారించేందుకు శనివారం విద్యుత్ మోటర్‌ను ఆన్ చేయగా పనిచేయలేదు.
కరెంట్ సరఫరా ఉందో లేదో తెలుసుకునేందుకు విద్యుత్ స్తంభానికి తగిలించిన తీగలను సరిచేస్తుండగా, అందులో ఒక టి ఊడి రాజిరెడ్డిపై పడింది. ఈ క్రమం లో విద్యుత్ షాక్ గురైన రైతు అక్కడి కక్కడే మృతి చెందాడు. అతడికి భార్య పద్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సంపేట మార్చురీకి తరలిం చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు స్థానిక ఏఎస్సై లక్ష్మణమూర్తి తెలిపారు.