హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 6: కాకతీయ యూనివర్సిటీ ఉద్యోగుల హాజరు పద్ధతిలో భాగంగా అమలు చేయనున్న ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్) నమోదు ప్రక్రియ వ్యవస్థను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం పర్యవేక్షించారు. నియమిత షెడ్యూల్ ప్రకారం విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కార్యాలయాలు, విద్యా విభాగాలు, ఆఫీసుల్లో ఈ గుర్తింపు ప్రక్రియను కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
శనివారం మొదటి రోజు పరిపాలన భవనం, పరీక్షల విభాగం, ఇంజినీరింగ్ కాలేజీ (కో-ఎడ్యుకేషన్) ఉద్యోగుల ముఖ గుర్తింపు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, 8న కూడా నమోదు కొనసాగుతుందని రిజిస్ట్రార్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్విభాగాధిపతి బి.రమ, విశ్వవిద్యాలయ నెట్ వర్కింగ్ సెల్ సంచాలకుడు డి.రమేష్ పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు.