మహబూబాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. అధినేత నిర్ణయాన్ని కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి స్పీకర్‌కు అందజేశారు. కాగా గిరిజన మహిళను గుర్తించి శాసనమండలి బీఆర్ఎస్ పార్టీ విప్‌గా ఉన్నతమైన పదవిని కట్టబెట్టినందుకు గాను రాష్ట్ర సాధకులు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కోసం అహర్నిశలు కృషిచేస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సత్యవతి రాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తానని, ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తూనే ఉంటానని సత్యవతి తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్‌ను సత్యవతి మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మండలి విప్‌గా అవకాశం కల్పించినందుకు గాను ఆయనకు పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు.