నయీంనగర్, ఫిబ్రవరి 3: ప్రమా దాలు జరుగకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ అన్నారు. తెలంగాణ రా ష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు అద్దె బస్ డ్రైవర్లకు సురక్షిత డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తున్నదన్నారు. శుక్రవారం వరంగల్ రీజియన్‌లోని తొమ్మిది డిపోలకు చెందిన డైవర్లకు వరంగల్‌లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ తరగతులను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మధుసూదన్ జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 13 లక్షల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని, ఇందులో 1.50 లక్షల మంది భారతదేశంలోని వారేనన్నారు.
రోడ్డు ప్రమాదాలతో 55 లక్షల మంది గాయపడుతున్నారని, ఇందులో 80 శాతం మంది పేదవారేనన్నారు. బాధితుల్లో అత్యధికులు 15 నుంచి 20 సంవత్సరాలలోపు వారేనన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు సంస్థకు అనుబంధంగా పని చేస్తు న్న అద్దె బస్సు డ్రైవర్లు జా గ్రత్తగా బస్సులు నడుపాలని మధుసూదన్ సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, రీజినల్ మేనేజర్ శ్రీలత, ప్రిన్సిపాల్ సుధా పరిమళ, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మాధవరావు, డిప్యూటీ రీజినల్ మెనేజర్ కృపాకర్‌రెడ్డి, మోహన్‌రావు, బాబునాయక్, సురేశ్, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.