తొర్రూరు, ఏప్రిల్ 12: అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని, అప్పటి వరకూ విద్యుత్ కార్మికులు పోరాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. అదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఆర్టీసీ డిపో ఎదుట విద్యుత్ కార్యాలయ ప్రాంగణంలో కార్మికులు చేపట్టిన సమ్మెను పరిశీలించి మద్దతు తెలిపారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడు తూ కేసీఆర్ ప్రభుత్వం జీవో నంబర్ 11ను అమలు చేసి విద్యుత్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి వేతనాలు పెం చిందన్నారు.
కాంట్రాక్ట్ వ్యవస్థను తగ్గించి విద్యుత్ కార్మికుల సమస్యలను పరిషరించడంలో కీలకపాత్ర పోషించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. జీవో 11ను వెంటనే అమలు చేసి, విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్లను ఉద్యోగులుగా మార్చాలని, అన్మ్యాన్డ్ వరర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. 2016కు ముందు పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి, పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 24 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు కొన్నేళ్లుగా సేవలందిస్తున్నారని, వారిని పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులు ఇప్పటికే తమ డిమాండ్లపై ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా స్పందించకపోవడం బాధాకరమన్నారు.
తకువ వేతనాలతో కుటుంబాలను పోషించలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటి వరకు సుమారు 200 మంది కార్మికులు మరణించినట్లు తెలిపారు. సమ్మెలో పాల్గొంటున్న కార్మికులను ప్రభుత్వం టర్మినేట్ చేయడం అన్యాయమని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అంజయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనీవాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, కుర్ర శ్రీనివాస్, మణిరాజ్, ఉపేందర్, అశయ్య పాల్గొన్నారు.