న్యూశాయంపేట, అక్టోబరు 28 : రైతుల కోసం వెలమ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వెలమ సంక్షేమ సంఘం భవనంలో సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నడివెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్‌క్యాంపు, నూతన స భ్యత్వ నమోదు చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరై న ఎర్రబెల్లి మాట్లాడుతూ వెలమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతమన్నారు.
రాబోయే రోజుల్లోనూ మరిన్ని నిర్వహించాలన్నారు. రైతు సదస్సు నిర్వహించడం ద్వారా పంటల సాగులో రైతులు మెళకువలు తెలుసుకుంటారని వివరించారు. వెలమ సంక్షేమ సంఘం ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, అందరూ కలి సి ఐక్యంగా పనిచేయాలని ఆయన కోరారు. హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నా రు. వెలను సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించే ఫంక్షన్‌హాల్‌కు తనవంతు సాయం అందిస్తానని ఎ ర్రబెల్లి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వెలమ సంఘం కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్రావు, ఉపాధ్యక్షులు తకళ్లపల్లి రవీందర్రావు, పిన్నింటి బాలచందర్రావు, తకళ్లపల్లి శాంసుందర్రావు, ప్రధాన కార్యదర్శి కే ప్రవీణ్‌కుమార్, సహాయ కార్యదర్శి విద్యాసాగర్‌రావు, కోశాధికారి చిత్తూరి స్వామిరావు, కార్యవర్గ సభ్యులు, కిమ్స్ ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.