పెద్దవంగర, జూలై 10 : బ్లాక్ మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడవడం చాలా బాధాకరమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సాగేది ప్రజాపాలన కాదని.. దోచుకునే పాలన అని అన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారు 420 బోగస్ హామీలతో ప్రజలు మోసపోయారని అన్నారు. రానున్న స్థానిక ఎన్నిక లను దృష్టిలో పెట్టుకొని రైతుభరోసా నిధులను విడుదల చేసిందన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదలకు కాకుండా కాంగ్రెస్ నాయకులకే లబ్ధి జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 80శాతం సీట్లు సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులకే కాంగ్రెస్ పార్టీ కొత్తగా శంకుస్థాపనలు చేస్తున్నదని, కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. చిన్నవంగర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాకనాటి రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరగా, ఎర్రబెల్లి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, దేవస్థానం మాజీ చైర్మన్ రామచంద్రశర్మ, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు యాదగిరిరావు, నాయకులు సుధీర్‌కుమార్, ప్రదీప్‌రావు, జ్ఞానేశ్వరాచారి, వెంకన్న, సమ్మయ్య, రఘు, వెంకట్రామయ్య, రాము, గంగాధర్‌యాదవ్, వీరన్నయాదవ్, బుజ్జమ్మ, వెంకట్‌రెడ్డి, రవి, కృష్ణమూర్తి, హరీశ్‌యాదవ్, భిక్షపతి, అశోక్‌యాదవ్ పాల్గొన్నారు.