వర్ధన్నపేట, జూలై 11: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలు అమలు చేయడం సాధ్యంకాకపోవ డంతో విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడం, తప్పుడు ఆరోపణలు చేసేందు కు సిద్ధపడుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వర్ధన్నపేట మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై కొంత మంది అధికార పా ర్టీ నేతలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయం లో ఏ ఒక్క తప్పు కూడా చేయలేదని, నా పక్కన ఉన్న వారిని కూడా తప్పులు చేయకుండా చూశానని అన్నారు.
తమ కుటుంబం ప్రజల కోసం పనిచేస్తూ కోట్లాది రూపాయల విలువ చేసే భూములను పోగొట్టుకున్నదని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఉనికి కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తనపై ఎలాంటి కేసులు నమోదు చేసినా భయపడే ప్రసక్తే లేదని, దేనికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి నిలిచి పోయిందన్నారు. దీంతో ప్రజలకు కనీస అవసరాలు కూడా అందడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధిం చాయని అన్నారు.
కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ పేరు చెబితేనే అప్పులు పుట్టడం లేదని దిగజారుడు మాటలు మాట్లాడుతూ రాష్ట్ర పరువు తీస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కరెంటు, సాగునీ టి కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రభు త్వ వైఫల్యాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అంతేకాక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచే అభ్యర్థుల విజయం కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల ఇన్చార్జి చింతల యాదగిరి, మాజీ ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమార స్వామి, ఏఎంసీ మాజీచైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, కోమాండ్ల ఎలేందర్రె డ్డి, తుమ్మల యాకయ్య, గోదుమల మధు, కొండేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.