పాలకుర్తి, మే 31: వానకాలం వచ్చినా రైతుల వడ్లు కాంటాలు పెట్టారా.. అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలోని తొర్రూరు జే లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లా డి వారి సమస్యలను తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా రైతులు కన్నీ రు పెడుతూ ఎర్రబెల్లికి తమ గోస చెప్పుకున్నారు. వెంటనే స్పం దించిన ఎర్రబెల్లి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు. స్పందించిన కలెక్టర్ త్వరలోనే కొనుగోళ్లు పూర్తి చేస్తామని, ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తెలవాలని కలెక్టర్ ఎర్రబెల్లిని కో రారు.
అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో రైతు లు అరిగోస పడుతున్నారని, అన్ని రంగాల్లో మోసం చేస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభు త్వం దొంగ ప్రభుత్వమని, రైతులను నిండా ముంచుతున్నదన్నారు. సకాలంలో లారీలు తెప్పించడంలో విఫలమైందన్నారు. ఎర్రటి ఎండలో ధాన్యం పోసుకొని కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షిస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు పసునూరి నవీన్, నల్లానాగిరెడ్డి, మాచర్ల ఎల్లయ్య, సర్పంచ్‌లు బానోత్ మహేందర్, పసులాది యాకస్వామి, లకావత్ సురేశ్, వెంకట్ నాయక్, జోగు గోపీ, మల్లారెడ్డి, వీరమనేని సోమేశ్వర్రావు, శివరాజు, కత్తి సైదులు పాల్గొన్నారు.