ధర్మసాగర్, మార్చి 23: ఎండిపోయిన పంట పొ లాలకు ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవన్నపేట పంపుహౌస్‌ను ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీ రాజయ్య, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు, రైతులతో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా వారు ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టుతో వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలప ల్లి, ములుగు, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 5 లక్షల 57వేల ఎకరాలకు రెండు పంటలకు సాగు నీరిచ్చేలా కేసీఆర్ రూపకల్పన చేశారని చెప్పారు. దేవాదుల 3వ దశ కింద రూ.1,49 4 కోట్లతో రామప్ప చెరువు నుంచి ఉనికిచర్ల వరకు టన్నెల్ పూర్తి చేశారన్నారు. దేవన్నపేట వద్ద పంప్‌హౌ స్ పనులు కేసీఆర్ సర్కారు పూర్తిచేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 15 నెలలుగా పనులు ముందుకు సాగక నాలుగు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో పెట్ట డం వల్ల మోటర్లు నడవని పరిస్థితికి తీసుకొచ్చిందని మండిపడ్డారు.
పంప్‌హౌస్ వద్ద ఉన్న భారీ సామ ర్థ్యం గల మోటర్లు పరిశీలించి అక్కడ ఉన్న లిఫ్ట్ అడ్వయిజర్ పెంటారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లుతో మాట్లాడామని వివరించారు. ఇప్పటికే నీళ్లు లేక జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో వరి పొలా లు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మిగిలిన కొద్దిపాటి పంటలకైనా సాగునీరందివ్వాలని అధికారులను కోర గా ఒకటీరెండు రోజుల్లో పంపులు ఆన్ చేసి నీరందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మోటర్లు ఆన్ చేసేందుకు ఆస్ట్రి యా నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులతో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని కోరారు.