రాయపర్తి, ఏప్రిల్ 18 : రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు పురుడుపోసుకున్న గులాబీ జెండా, కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం రాయపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారుడో.. ప్రభుత్వం కూలుడో జరుగుతుందని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ బహిరంగ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి గులాబీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఎర్రబెల్లి కోరారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే తాము అభాసుపాలవుతామన్న భావనతోనే ఎన్నికల నిర్వహణకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాహసించడం లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యమ రథసారథి కేసీఆర్ నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఏం అద్భుతాలు జరుగుతాయో.. గులాబీ బాస్ ఏం ప్రసంగిస్తాడోనని ప్రపంచమంతా ఎల్కతుర్తి సభ వైపే ఉరకలేత్తే ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, గుడిపూడి గోపాల్‌రావు, నాయకులు జినుగు అనిమిరెడ్డి, పూస మధు, గారె నర్సయ్య, లేతాకుల రంగారెడ్డి, కర్ర రవీందర్‌రెడ్డి, కుందూరు రాంచంద్రారెడ్డి, గుగులోత్ జాజునాయక్, మహ్మద్ అక్బర్, పారుపల్లి సుధాకర్‌రెడ్డి, గాజులపాటి నర్మద, భూక్యా క్రాంతి, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్‌యాదవ్, సతీశ్‌యాదవ్, ఉబ్బని సింహాద్రి, భూక్యా సురేందర్రాథోడ్నాయక్, తాళ్లపల్లి సంతోష్‌గౌడ్, చిన్నాల ఉప్పలయ్య, చిలువేరు సాయిగౌడ్, మండల శ్రీధర్, చిట్యాల వెంకటేశ్వర్లు, జయశ్రీ, బొడ్డు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.