తొర్రూరు/దంతాలపల్లి, ఏప్రిల్ 23: గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగరేసి రజతోత్సవ సభకు దండులా కదలాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఎలతుర్తి లో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా దండూరు మైసమ్మ, నెమ్మికల్ నుంచి మొదలైన ఎడ్లబండ్ల ర్యాలీ బుధవారం దంతాలపల్లి, తొర్రూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎడ్లబండ్లకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు ఎడ్లబండ్లు నడుపుతూ కార్యకర్తల్లో హుషారు నింపారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ సభకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందితో సభ జరుగనుందని, కేసీఆర్ రావడంతో దద్దరిల్లనుందని అన్నారు. రజతోత్సవ సభకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులకు అనుమతిస్తే పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బస్సులు రానివ్వకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. రైతుబంధు అడిగితే పైసలు లేవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఒప్పుకున్నాడని అన్నారు.
కార్యక్రమంలో తొర్రూరు మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య, పట్టణ అధ్యక్షులు బిందు శ్రీనివాస్, శ్రీనివాస్, వరింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్‌రెడ్డి, పార్టీ కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు ఎన్నమనేని శ్రీనివాస రావు, మణిరాజు, రవి, శంకర్, జైసింగ్,ఎసే అంకూస్, కాలూనాయక్, వెంకన్న, జాటోత్ స్వామి, భాసర్, సోమలింగం, డిష్ శ్రీనివాస్, ఎల్పుకొండ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాశీబుగ్గ/ఐనవోలు : వరంగల్ నగరంలోని 3వ డివిజన్లోని ఆరెపల్లిలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ పార్టీల నుంచి షేక్ ఉస్మాన్, షేక్ ఆదాం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవి ధంగా ఐనవోలు మండలంలోని లింగమోరిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నా యకులు గులాబీ కండువా కప్పుకున్నారు. వీరికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. కాంగ్రెస్‌తో అభివృద్ధి శూన్యమని, మళ్లీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా పెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షురాలు ఎల్లావుల లలితాకుమార్ యాదవ్, నేరెళ్ల రాజు, ఇట్యాల హరికృష్ణ, మాజీ కార్పొరేటర్లు వీర భిక్షపతి, చింతల యాదగిరి, బీఆర్ఎస్ ఐనవోలు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కళ్లపల్లి చందర్రావు, కన్వీనర్ తంపుల మోహన్, ఇన్చార్జి గుజ్జ గో పాల్‌రావు, నాయకులు మంగ నర్సయ్య, కమలాపురం సుధాకర్, కందగట్ల మోహన్, కాడబో యిన భిక్షపతి, జన్ను రాంబాబు, జన్ను సారంగపాణి, దేవదాసు, మాజీ ఎంపీటీసీ దామెర అనూష, గ్రామపార్టీ అధ్యక్షుడు ఎస్కే జిందా, కుంట తిరుపతి పాల్గొన్నారు.