కాశీబుగ్గ, జనవరి 28 : ఎర్రబంగారంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కళకళలాడుతోంది. ఈ సీజన్ జనవరిలో ప్రారంభం కాగా అత్యధికంగా మంగళవారం మిర్చి యా ర్డుకు 15వేల బస్తాలు రావడంతో ఖరీదు వ్యా పారులు, అడ్తిదారులు, కార్మిక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మిర్చి సీజన్లో ఒక్కరోజు లక్షకు పైగా బస్తాలు వస్తాయని ప్రారంభంలో మాత్రం వెయ్యి బస్తాల నుంచి రెండు వేల బస్తాలు వచ్చినట్లు తెలిపారు. తేజ మిర్చి 9వేల బస్తాలు రాగా ధరలు గరిష్ఠంగా రూ.14వేలు, మధ్య రకం రూ.13 వేలు, కనిష్ఠంగా 11,50 0, వండర్‌హాట్ 1500 బస్తాలు రాగా అత్యధికంగా రూ.15, 200, మధ్యరకం రూ.1వేలు, కనిష్ఠంగా రూ.12వేలు, యూఎస్-341 రకం మిర్చి 2 వేల బస్తాలు వచ్చాయి. అత్యధికంగా రూ.15,500, మధ్యరకం రూ.14వేలు, కనిష్ఠంగా రూ.12,500, తాలు మిర్చి 2వేలు రాగా గరిష్ఠంగా రూ.7వేలు, మధ్యరకం రూ.6వేలు, కనిష్ఠంగా రూ.3వేలు ధరలు పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపారు.