మిర్చి @30,918 బస్తాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి యార్డుకు సోమవారం రికార్డు స్థాయిలో 30,918 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాగా సోమవారం అత్యధికంగా మిర్చి బస్తాలు రావడంతో మార్కెట్లో ఎటుచూసినా ఎర్రబంగారం బస్తాలతో కళకళలాడింది.
- ఎర్రబంగారంతో ఎనుమాముల మార్కెట్ కళకళ
- ఈ సీజన్లోనే ఇదే అత్యధికం
- నిలకడగానే మిర్చి ధరలు
- వ్యాపారులు, వివిధ కార్మికుల హర్షం
కాశీబుగ్గ, ఫిబ్రవరి 5 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి యార్డుకు సోమవారం రికార్డు స్థాయిలో 30,918 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాగా సోమవారం అత్యధికంగా మిర్చి బస్తాలు రావడంతో మార్కెట్లో ఎటుచూసినా ఎర్రబంగారం బస్తాలతో కళకళలాడింది. సీజన్ ప్రారంభంలో నామమాత్రంగా రోజుకు రెండు వేల నుంచి 10వేల బస్తాల వరకు వచ్చేవి. సంక్రాంతి పండుగ తర్వాత మార్కెట్‌కు మిర్చి బస్తాల రాక పెరిగింది. జనవరి 19న అత్యధికంగా 25వేల బస్తాలు వచ్చాయి. సోమవారం 30,918 లకు పైగా మిర్చి బస్తాలు మార్కెట్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ధరలు మాత్రం ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా నిలకడగానే ఉంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. మిర్చి రాక పెరగడంతో అడ్తి, ఖరీదు వ్యాపారులతో పాటు దడువాయి, గుమా స్తా, హమాలీ, ఇతర కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు చేతి నిండా పని దొరుకుతుందని కార్మికులు సంబురపడుతున్నారు. ఇప్పటివరకు మార్కెట్‌కు లక్షా 81వేల క్వింటాళ్ల మిర్చి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపారు. వీటిలో తేజ రకం అత్యధికంగా క్వింటాల్‌కు రూ.21,100, కనిష్టంగా రూ.14,500, వండర్‌హాట్ అత్యధికంగా రూ.20,500, కనిష్టంగా 14,500, యుఎస్-341 రూ.20వేలు, కనిష్టంగా 14వేలు, తాలు రకం మిర్చి రూ.8500, కనిష్టంగా రూ.5వేలు ధరలు పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలిపారు.
ఎనుమాముల మార్కెట్లో రికార్డుల తనిఖీ
కాశీబుగ్గ, ఫిబ్రవరి 5: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డులను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్‌తోపాటు జేడీఎం ఎన్నారపు మల్లేశం, డీడీఎం అజ్మీరా రాజునాయక్, డీఎంవో పాలకుర్తి ప్రసాద్‌రావు, కార్యదర్శి క్యారం సంగయ్య సమావేశమయ్యారు. మార్కెట్ పరిధిలో జరుగుతున్న క్రయవిక్రయాల తీరు, రైతుల సమస్యలు, అడ్తి, ఖరీదు లైసెన్స్‌ల రెన్యువల్స్, వేమెంట్స్, సిబ్బంది పనితీరుపై చర్చించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

