నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఉద్యోగులు పోరుబాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఏసీ నేతృత్వంలో శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఆర్డీవోలు, తహసీల్దార్లకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందజేశారు.
జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం పునరుద్ధరించాలని కోరారు.