పత్తి చేనులో విద్యుత్ తీగలు ఇలా కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. గాలిదుమారానికి విద్యుత్ స్తంభం ఒరిగి నెల రోజులైనా ఇప్పటికీ సరిచేయలేదు.
దీంతో భయంభయంగా చేనుకు పురుగు మందు కొట్టాల్సి వస్తున్నదని రైతు బోడ రాజు ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. ఆదమరిస్తే ప్రజలతో పాటు మూగజీవాలు విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉందని, వెంటనే అధికారులు స్పందించి తీగలను సరిచేయాలని రైతులు కోరుతున్నారు.
-నెక్కొండ, ఆగస్టు 16