హనుమకొండ, అక్టోబర్ 6 : బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈగ మల్లేశం బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం హనుమకొండ, వరంగల్ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో చేరిన ఈగ మల్లేశంకు మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం ఉన్న మల్లేశం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి పార్టీలో చేరుతున్నట్లు మల్లేశం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తానని అన్నారు.