సర్కారు బడుల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం(సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీం) అమలుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికులను సమాయత్తం చేస్తున్నారు. ఈ నెల 6న ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఒక్కో స్కూల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం వరంగల్ జిల్లాలో మూడు, హనుమకొండ జిల్లాలో రెండు ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. రెండు జిల్లాల్లోని 1,503 ప్రభుత్వ పాఠశాలల్లో 1,57,881 మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందనుంది.
– వరంగల్, అక్టోబర్ 3 (నమస్తేతెలంగాణ) హనుమకొండ చౌరస్తా
వరంగల్, అక్టోబర్ 3(నమస్తేతెలంగాణ): ఇప్పటికే అన్ని సర్కారు బడుల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కూళ్లలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా సమకూర్చడానికి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీంను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ప్రకటించింది. దసరా సెలవుల తర్వాత ఈ నెల 24న ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకాన్ని లాంఛనంగా ప్రా రంభించనున్నట్లు పేర్కొంది. తాజాగా దీన్ని ఈ నెల 6న ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు వి ద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇతర ఉన్నతాధికారులు సోమవారం సాయంత్రం డీఈవోలతో టెలీ కా న్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 13 నుంచి దసరా సెలవులు ఉన్నందున 6 నుంచి 12వ తేదీ వరకు ఆరు రో జుల పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సీఎం అల్పాహారం పథకాన్ని అ మలు చేయా లని నిర్దేశించారు.
‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనులు పూర్తయిన పాఠశాల లను ఈ పథకం ప్రారంభానికి ఎంపిక చేయాలని ఆదేశించారు. సమర్థంగా పథకాన్ని అమలు చేయగల ప్రధానోపాధ్యాయుడు గల పాఠశాలలను ఎంచుకోవాలని సూచించారు. దీంతో జిల్లాలో నర్సంపేట, వ రంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున మూడు ప్రభుత్వ పాఠశాలలను సీఎం అల్పాహారం పథకం ప్రారంభానికి ఎంపిక చేయనున్నట్లు డీఈవో డీ వాసంతి వెల్లడించారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఆ యా నియోజకవర్గం ఎమ్మెల్యే పాల్గొనే అవకాశం ఉం ది. 6న సీఎం అల్పాహారం పథకం ప్రారంభం కోసం పాఠశాలలను ఎంపిక చేయడంపై విద్యాశాఖ అధికారులు ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యేను సంప్రదించినట్లు తెలిసింది. 6న జిల్లాలో రాష్ట్ర పురపాలక, ఐటీ శా ఖ మంత్రి కేటీ రామారావు పర్యటన ఉండడం, అదేరోజు సీఎం అల్పాహార పథకం ప్రారంభం కానుండడంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఎంతమంది విద్యార్థులకంటే..
జిల్లాలో 1,011 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో ప్రాథమిక 504, ప్రాథమికోన్నత 161, ఉన్నత పాఠశాలలు 346 ఉన్నాయి. మొత్తం పాఠశాలల్లో మండలం వారీగా చెన్నారావుపేటలో 60, దుగ్గొండిలో 50, గీసుగొండలో 55, ఖానాపురంలో 46, ఖిలావరంగల్లో 151, నల్లబెల్లిలో 52, నర్సంపేటలో 90, నెక్కొండలో 86, పర్వతగిరిలో 63, రాయపర్తిలో 70, సంగెంలో 60, వరంగల్లో 185, వర్ధన్నపేటలో 43 ఉన్నాయి. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో 18,074, ప్రాథమికోన్నత పాఠ శాలల్లో 11,844, ఉన్నత పాఠశాలల్లో 90,963 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చెన్నా రావుపేటలో 4,426, దుగ్గొండిలో 3,435, గీసుగొండలో 7,009, ఖానాపురంలో 2,826, ఖిలా వరంగల్లో 22,937, నల్లబెల్లిలో 4,855, నర్సంపేటలో 13,101, నెక్కొండలో 6,763, పర్వతగిరిలో 6,293, రాయపర్తిలో 4,623, సంగెంలో 4,521, వరంగల్లో 35,252, వర్ధన్నపేటలో 4,840 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ 1,011 ప్రభుత్వ పాఠశాలల్లోని 1,20,881 మంది విద్యార్థులకు ఇప్పటికే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. దీనికితోడు కొత్తగా ఈ స్కూళ్లలోని వీరందరికీ సీఎం అల్పాహార పథకం అమల్లోకి రానుంది. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు ఈ పథకం ప్రారంభ ఏర్పాట్ల బిజీలో తలమునకలయ్యారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టిఫిన్..
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 3: సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో పాటు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం పెడుతున్న విష యం తెలిసిందే. తాజాగా మరో అడుగు ముందుకేస్తూ సీఎం కేసీఆర్ స్కూల్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. బడికి వచ్చే పేద విద్యార్థులు ఆకలితో ఉండవద్దనే ఉద్దేశంతో టిఫిన్ అందించ నుంది. హనుమకొండ జిల్లావ్యాప్తంగా 492 పాఠశాలల్లో 37, 000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మిడ్డే మీల్స్ అమలులో ఉన్న పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా రెండు పాఠశాలలను ఎంపిక చేశారు. వరంగ ల్ పశ్చిమలో లష్కర్బజార్ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్, పరకాలలో ప్రభుత్వ బాలికల పాఠశాలను ఎంపిక చేశారు. ఈనెల 6 నుంచి ఈ రెండు పాఠశాలల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ ప్రారంభించనున్నారు. అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన తర్వాత అన్ని పాఠశాలలో అమలు చేయనున్నారు. టిఫిన్లో రవ్వ ఉమ్మా, పొంగల్, కేసరి, కిచిడీ వంటివి మెనూలో అందించేందు కు విద్యాశాఖ పరిశీలిస్తోంది.