నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
డీఎస్సీ పరీక్షలు గురువారం నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించనున్నారు.
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు కేంద్రాలు
- పరీక్ష రాయనున్న 27,741 మంది అభ్యర్థులు
- ఆగస్టు 5వ తేదీ వరకు ఉదయం 9,మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షలు
- 10 నిమిషాలు ముందుగానే చేరుకోవాలని అధికారుల వెల్లడి
హనుమకొండ చౌరస్తా, జూలై 17 : డీఎస్సీ పరీక్షలు గురువారం నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హనుమకొండలోని జయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కిషన్‌పురలోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ, హసన్‌పర్తిలోని నోబుల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్, ఎర్రగట్టు గుట్ట వద్ద ఉన్న అయాన్ డిజిటల్ జోన్, భీమారం సమీపంలోని మోక్షిత కంప్యూటర్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక్కో అబ్జర్వర్‌ను నియమించా రు.
13 రోజుల పాటు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు నిర్వహించే పరీక్షలకు అభ్యర్థులను రెండు గంటల ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. 10 నిమిషాలు ముందుగానే ఉదయం 8.50 గంటలకే గేట్లు మూసివేస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే పరీక్షలకూ రెండు గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1.50 గంటలకే గేట్లు మూసివేస్తారు. తర్వాత వచ్చే వారిని లోపలికి అనుమతించరు. 2 గంటల నుంచి 4:30 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఐదు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 27,741 మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాయనున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

