కురవి, ఏప్రిల్ 10: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ విమర్శించారు. గురువారం సీరోలు మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. సభ పోస్టర్లను ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మి ప్రజలు మోసం పోయారని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
బీఆర్ఎస్ సభకు 10 వేల మందిని తరలిస్తామని, విజయవంతం చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కురవి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట లాలయ్య, నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, గుగులోత్ రవినాయక్, తేజావత్ భోజ్యానాయక్, పెద్ది వెంకన్న, విజయ్‌పాల్ రెడ్డి, మోహన్‌నాయక్, బీకోజీ నాయక్, హరీశ్, అప్పారావు, హైమావతి, అనిల్ రెడ్డి, జలగం వెంకన్న, మామిండ్ల వెంకన్న, యాకూ బ్, నరహరి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుడు బైరి హరి బీఆర్ఎస్ పార్టీలో చేరగా, రెడ్యానాయక్ కండువా కప్పి ఆహ్వానించారు.