పరకాల, అక్టోబర్ 8 : రాష్ట్రంలో పేద వర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తూ వారి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి 29 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదిన్నర ఏండ్లలోనే అభివృద్ధిలో ముందంజలో నిలుస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్‌తో పాలన కొనసాగిస్తున్నారన్నారు. లో అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించేలా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో అమ లవుతున్న అనేక పథకాలు ఇతర రాష్ర్టాలు, దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ పేదల అభివృద్దికి ఎనలేని కృషి చేస్తున్నారని మేనిఫేస్టోలో లేని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి, పారదర్శకంగా అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని, ఆయన మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, ఎంపీపీ తక్కలపల్లి స్వర్ణలత, జడ్పీటీసీ మొగిలి, వైస్ ఎంపీపీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్ వెలగందుల కృష్ణ, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, నాయకులు నేతాని శ్రీనివాస్‌రెడ్డి, నిప్పాని సత్యనారాయణ, బండి సారంగపాణి, గంట సమ్మిరెడ్డి, రాంగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
గూడెప్పాడ్‌లో..
ఆత్మకూరు : మండలంలోని గూడెప్పాడ్‌లో 22 డబుల్ బెడ్ రూం ఇండ్లను సర్పంచ్ బీరం శ్రీలత రామకృష్ణారెడ్డితో కలిసి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో 52 మంది లబ్ధిదారుల కు డబుల్ బెడ్రూం ఇళ్లును అందించినట్లు తెలిపారు. కొత్తగా మరో 22 మంది పేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించినట్లు చెప్పారు. పేదవారి సొంతంటి కల నెరవేర్చడానికి సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. నూతనంగా నిర్మించిన ఇండ్లకు త్వరలోనే నల్లా నీళ్లు అందిస్తామన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం లో తెలంగాణ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించాలన్నారు. నియోజకవర్గంలో బీజేపీలో ఊరుకొక్కడు లేడు గానీ బీఆర్ఎస్పై దుష్ప్రచా రం చేసున్నారన్నారు.
దాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించిన కాంట్రాక్టర్ జనగాం సాంబయ్యను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కారించారు. పీఆర్ డీఈ లింగారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ బత్తిని సంగీత, పీఆర్ ఏఈ లత, ఎంపీపీ మార్క సుమలతా రజినీకర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధికా రాజు, సర్పంచ్‌లు బీరం శ్రీలతా రామకృష్ణారెడ్డి, రంపీస మనోహర్, మాడిశెట్టి వేణుగోపాల్, మచ్చిక యాదగిరి, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, గూడెప్పాడ్ మార్కెట్ చైర్మన్ బొల్లోబోయిన రాధారవి యాదవ్, మాజీ చైర్మ న్ కాంతాల కేశవరెడ్డి, మాజీ సర్పంచ్ జనగాం స్వరూపా సాంబయ్య, ఉపసర్పంచ్ వీసం శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి, బీఆర్ఎస్ నాయకులు కాంతాల రవీందర్‌రెడ్డి, రెమిడి బుచ్చిరెడ్డి, రెమిడి కృష్ణారెడ్డి, వంగాల భగవాన్‌రెడ్డి, వీర్ల వెంకటరమణ, తోట కుమారస్వామి పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
గీసుగొండ : రైతుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ 15వ డివిజన్ రెడ్డిపాలెంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్స్‌తోపాటు పక్కనే గ్రామస్తులు ఏర్పాటు చేసిన రాణీ రుద్రమదేవి విగ్రహాన్ని ఎమ్మెల్యే అవిష్కరించారు. అనంతరం మొగిలిచెర్ల గ్రామంలో రూ.52 లక్షలతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల గోదాం, సొసైటీ కార్యాలయాన్ని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎలా ఉండేది? ప్రత్యేక రాష్ట్రంలో ఎలా అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనించాలన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటుతో పాటు సాగు నీరు అందిస్తున్నారన్నారు. రైతు మూడు పంటలు పండిస్తున్నడంటే అందుకు సీఎం కేసీఆరే కారణమన్నారు.
దేశంలో ఏ ప్రభుత్వం రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదన్నారు. రైతులు పండించిన సరుకులు నిల్వ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గోదాములను నిర్మిస్తున్నదన్నారు. ప్రజలను మోసం చేయటానికి కొం దరు వస్తున్నారన్నారు. మోసాల కాంగ్రెస్‌ను, అబద్దాల బీజేపీని ప్రజలు నమ్మవద్దని కోరారు. నియోజకవర్గం అభివృద్ధి చూసి మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. యావత్తు దేశం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం వైపు చూస్తోందన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ను మళ్లీ ఆశ్వీదించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, గీసుగొండ సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, సొసైటీ వైస్ చైర్మన్ కందుల శ్రీనివాస్‌రెడ్డి, కోఆపరేటివ్ అధికారులు సంజీవరెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్, బీఆర్ఎస్ నాయకులు సుంకరి శివకుమార్, గజ్జి రాజు, గోలి రాజయ్య, లవ్ రాజు, నర్సయ్య, రఘ, సతీశ్, పూర్ణచందర్, నర్సింగరావు పాల్గొన్నారు.