మరిపెడ, అక్టోబర్ 25: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా సేవలందిస్తున్న తనను మరోమారు భారీ మెజార్టీతో గెలిపించాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కోరారు. బుధవారం మరిపెడలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో నెలకొన్న దుర్భర దుస్థితులను, కేసీఆర్ పాలనలో జరిగిన ప్రగతిని పరిశీలించాలన్నారు. సాగునీళ్ల కష్టాలు, కరెంట్ కోతలు, తాగునీళ్లకు మహిళలు మైళ్ల కొద్ది దూరం నడిచిన దయనీయ పరిస్థితులు నేడు లేవన్నారు. చేతివృత్తులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉపాధితో పల్లెల్లోనే సంపద పెరుగుతున్నదన్నారు. పట్ట ణాలకు వలస వెళ్లిన వారు నేడు స్వగ్రామాలకు తిరుగుముఖం పడుతున్నట్లు తెలిపారు.బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన చదువు ల కోసం ప్రభుత్వం జిల్లాకు ఓ మెడికల్ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటుకు కృషి చేసింద న్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయిల్లో సేవలందించనున్నారని పేర్కొన్నారు. గ్రామాలు మొదలు పురపాలిక కేంద్రాల్లోని క్రీడామైదానాలు ఏర్పాటు చేసి విద్యా ర్థులకు దేహదారుఢ్యం పెంచుకునేందుకు వేదిక లు ఏర్పాటు చేశారని తెలిపారు.
యువతను స న్మార్గంలో నడిపించి బంగారు భవిష్యత్ అంద జేయడమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేసిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఓటుకు నోటు దొంగ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ చేతులు కాల్చుకుందని, తెలంగాణ లో బీజేపీ కమలం వాడిపోయిందన్నారు. సుదీర్ఘ కాలం రాజకీయ ఏలుబడిలో ఉన్న బీజేపీ, కాంగ్రె స్ పార్టీలు చేయలేని ప్రగతిని సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల కాలంలో చేసి చూపారని కొని యాడా రు. డోర్నకల్, మరిపెడ మున్సిపల్ కేంద్రా లుగా ఏర్పాటు చేసి రూ. 300 కోట్లతో సుంద రమైన పట్టణాలు తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే రెడ్యానా యక్ వివరించారు. మరిపెడలో యువ తకు రూ.3 కోట్లతో ఇండోర్ స్టేడియంతో జాతీ యస్థా యి షటిల్ ఓపెన్ టోర్నీలకు వేదికగా మరి పెడ నిలవడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమ యంలో టీఎస్ గురుకులం, టీఎస్ మోడల్ స్కూ ల్తో పాటు ఐదు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మరిపెడను ఎడ్యుకేషనల్ హబ్‌గా నిలిపినట్లు చెప్పారు.
మరిపెడలో రూ.36 కోట్లతో 3 ఎకరాల విస్తీర్ణంలో వంద పడకల ఆస్పత్రి, నర్సింహులపే ట, సీరోలు, బలపాల మండల కేంద్రాల్లో రూ. కోటీ 50లక్షల చొప్పున పీహె చ్‌సీలు మంజూరు చేయించి నూతన భవన నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. నియోజకవ ర్గంలో స్థానికేతరులకు స్థానం కల్పిస్తే నియోజకవ ర్గ ప్రగతి పదేళ్లు వెనక్కు పోనుందని విచారం వ్యక్తం చేశారు. ప్రగతి దిశగా పయణిస్తున్న సీఎం కేసీఆర్‌కు సంఘీభావంగా నిలిచి అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు. కార్యక్ర మంలో జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు, యువ నేత డీఎస్ రవిచంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ సింధూరాకుమారి, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, జిల్లా మైనార్టీ నాయ కులు అయూబ్ పాషా, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, గుగులోత్ రాంబాబునాయక్, గంధసిరి అంబరీష, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వరరావు, రైతుబంధు జిల్లా సభ్యులు పొను గోతు వెంకన్న, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు జాటోత్ బాలా జీ, బాచీ, మైనార్టీ నాయకులు స య్యద్ లతీఫ్, మక్సుద్, ఖైరుణ్ హుస్సేన్, సర్దార్, యాకూబ్ పాషా, బదావత్ సురేశ్ పాల్గొన్నారు.