నర్సంపేట, అక్టోబర్ 31: పెద్ది సుదర్శన్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ అన్నారు. నర్సంపేటలోని 22, 14, 16వ వార్డులో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక దఫా పెద్ది ఎమ్మెల్యేగా గెలిచినందుకే నర్సంపేటలో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. ఏ నియోజకవర్గంలోనూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం నర్సంపేటలో అమలయ్యేలా ఎమ్మెల్యే కృషి చేశారన్నారు. పెద్దికి అధిక మెజార్టీ అందించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పెద్దిని మరోసారి ఆశీర్వదిస్తే నర్సంపేటను రెట్టింపుస్థాయిలో అభివృద్ధి చేస్తారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నల్లా మనోహర్‌రెడ్డి, గుంటి కిషన్, కౌన్సిలర్ వేల్పుగొండ పద్మా రాజు, తాళ్లపల్లి చంద్రప్రకాశ్, నాగెళ్లి శివ, రామగోని సుధాకర్, గాలి శ్రీనివాస్ పాల్గొన్నారు.
దుగ్గొండి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. మందపల్లి, మదిరలో మంగళవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పెద్ది ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రజల్ల్లో చర్చ పెట్టాలని కార్యకర్తలను కోరారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిత్యం ప్రజల్లో ఉంటున్న పెద్దిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ రాజ్‌కుమార్, సర్పంచ్ మొగ్గం మహేందర్, ఉపసర్పంచ్ మాతంగి భరత్, వేల్పుల శ్రీను, పెండ్యాల సుమన్, ఎస్సీసెల్ మండల నాయకులు రాజ్‌కుమార్, అనిల్ పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: పెద్ది గెలుపు కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, జడ్పీటీసీ కోమాండ్ల జయ పిలుపునిచ్చారు. మండలంలోని దాసరిపల్లి, కమ్మపల్లిలో పార్టీ గ్రామ కమిటీల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా వీరన్న, క్లస్టర్ ఇన్చార్జీలు మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, కొడారి రవన్న, కడారి కుమారస్వామి, తాళ్లపల్లి రాంప్రసాద్, కట్ల సుదర్శన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి, మోటూరి రవి, సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ-ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ముగ్దుంపురంలో సర్పంచ్ పెండ్యాల జ్యోతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు చాపర్తి భిక్షపతి, పెండ్యాల ప్రభాకర్, బీసీసెల్ మండల అధ్యక్షుడు పెండ్యాల సదానందం, ఉప సర్పంచ్ ఇస్లావత్ రాజన్న, మల్లేశం, రవి, రమేశ్, సురేశ్ పాల్గొన్నారు.
ఖానాపురం/చెన్నారావుపేట: పాకాలకు గోదావరి జలాలను తీసుకొచ్చి ఆయకట్టు రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన పెద్ది సుదర్శన్‌రెడ్డికి రైతులు కృతజ్ఞతా ఓటు వేసి గెలిపించాలని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ మస్తాన్ కోరారు. పెద్ది గెలుపు కోరుతూ ఖానాపురం, మనుబోతులగడ్డలో నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో వాల్‌పోస్టర్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ సోమయ్య, దాసరి రమేశ్, తక్కళ్లపల్లి రమేశ్, కుందెనపల్లి శైలజ, వేములపల్లి సునీత, సొసైటీ డైరెక్టర్ ఆబోత్ అశోక్, యాకయ్య, నాగుల్‌మీరా, ఉప్పలయ్య, మల్లేశ్, వెంకన్న, సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేట మండలంలోని ఖాదర్‌పేట, బోడ మాణిక్యంతండాలో పెద్ది గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తినాయక్, ఎన్నికల మండల ఇన్చార్జి బాల్నె వెంకన్న, క్లస్టర్ ఇన్చార్జి వీరారెడ్డి, సర్పంచ్ కుమారస్వామి, అమినాబాద్ పీఏసీఎస్ చైర్మన్ రవి, పార్టీ గ్రామ అధ్యక్షుడు మహేందర్, బోడ ఆనంద్ పాల్గొన్నారు.
నెక్కొండ: దళితులంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, దళితుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ సర్కారు కట్టుబడి పని చేస్తున్నదని ఆ పార్టీ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు ఈదునూరి రమేశ్ అన్నారు. పెద్దకోర్పోలులోని దళిత కాలనీల్లో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సాదు నర్సింగరావు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఈదునూరి వెంకటేశ్వర్లుతో కలిసి రమేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు యాదగిరి, నేలమారి నాగరాజు, బిర్రు రాజు, పెద్దకోర్పోలు సర్పంచ్ మహబూబ్బాపాషా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండె వెంకన్న, బానోత్ శోభన్, కర్ర బుచ్చిరెడ్డి, నిత్యానందం పాల్గొన్నారు. అంతేకాకుండా నెక్కొండలో సొసైటీ చైర్మన్ మారం రాము ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కారుగుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డితోపాటు నాయకులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డిని మరోసారి అధిక మెజార్టీతో గెలిపించడమే కార్యకర్తల ధ్యేయమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి అన్నారు. మామిండ్లవీరయ్యపల్లెలో పార్టీ క్లస్టర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పెద్ది గెలుపునకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు పాలెపు రాజేశ్వర్‌రావు, చెట్టుపెల్లి మురళీధర్‌రావు, ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, కోటిలింగాచారి, శ్రీనివాస్‌గుప్తా, మోహన్‌రెడ్డి, ఇంగ్లి శివాజీ, సర్పంచ్ అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఖానాపురం: పాకాల ఆయకట్టు రైతుల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసిన బీఆర్ఎస్ సర్కారుకు కృతజ్ఞతగా కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. అశోక్‌నగర్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ పాకాలకు గోదావరి జలాలు రావడంతో ఇకపై ఏటా ఆయకట్టులో మూడో పంట పండించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అన్నం పెట్టే పార్టీకే ఓటేసి రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమ్మేళనంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, రాణాప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ ప్రకాశ్‌రావు, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, యాదగిరిరావు, బండి వెంకన్న, ఇర్కు కోటేశ్వర్రావు, దేవేందర్‌రావు, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.