నల్లబెల్లి, జూలై 26 : నర్సంపేట నియోజకవర్గంలోని రూ. రూ. 400 కోట్ల అభివృద్ధి నిధులు నిలిపి వేయాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు నల్లబెల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజన తండాలకు శాశ్వత రవాణా సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో బండ్లబాటలకు సైతం తారు రోడ్లుగా నిర్మించేందుకు ప్రత్యేక జీవో ద్వారా రూ. 400 కోట్లు మం జూరు చేశానని తెలిపారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే ఆ పనులను రద్దు చేయాలని రాష్ట్రప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీ మంత్రి, మైనార్టీ వెల్ఫేర్ శాఖకు లేఖ రాయడం హేయమైన చర్య అని అన్నారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన ఎమ్మెల్యే వైఖరికి ప్రజాకోర్టులోనే గుణపాఠం చెబుతామని, అన్ని మండలాల ప్రజలు జెండాలను పక్కన పెట్టి రోడ్ల నిర్మాణాలను పూర్తి చేసేంత వరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ వార్డు మెంబర్ పరికి నవీన్ పెద్ది సమక్షంలో సొంత గూటికి చేరారు.
సమావేశంలో బీఆర్ఎస్ నల్లబెల్లి, చెన్నారావుపేట మండలాల అధ్యక్షులు బానోత్ సారంగపాణి, బాల్నె వెంకన్న, ప్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్‌రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, నాయకులు గందె శ్రీనివాస్‌గుప్తా, మాజీ సర్పంచ్ రాజారాం, నాయకులు మేడిపల్లి రాజ్‌గౌడ్,వైనాల మధు, రాంబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.