శాయంపేట, ఆగస్టు 10 : ‘బీసీలతో గొక్కుంటానవ్ రేవంత్‌రెడ్డీ, ఎవరు అధికారంలో కి రావాలన్నా ప్రధాన పాత్ర వారిదే. అలాంటి వారిని చులకనగా, అవమానకరంగా చూస్తే ఊరుకోం. మాటిచ్చి తప్పు తం, ఎవరేమి చేసుకుంటారో చేసుకోండని అహంకార ధోరణితో వ్యవహరిస్తే కర్రుకాల్చి వాతపెడతారు’ అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. శాయంపేటలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకుండా కాలయాపన చేస్తే కాంగ్రెస్‌కు మరణశాసనం రాయడం ఖాయమన్నారు. బీసీల పక్షాన నిలిచి వారి అభ్యున్నతికి కృషి చేసింది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను తిట్టడం తప్ప కాంగ్రెస్ చేస్తున్నది ఏమీ లేదన్నారు. బీసీల విషయంలో 42 శాతం రిజర్వేషన్లు దేశానికి స్వాతం త్య్రం వచ్చినంక 75 ఏండ్లకు ఇస్తామంటున్నారని, దేశంలో మెజారిటీ ఉన్న బీసీలను కాంగ్రెస్ ఎందు కు రాజ్యాధికారానికి దూరం చేసిందని ప్రశ్నించా రు.
దేశం అభివృద్ధి చెందకపోవడానికి రాజ్యాధికారానికి బీసీలను దూరం చేయడం ఓ కారణంగా అభివర్ణించారు. ఇదీ ఒక కుట్ర అని పేర్కొన్నారు. రూ. 50లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దేశంలో బీసీలకు రెండు, మూడువేల కోట్లు పెట్టడమేంటని ప్రశ్నించారు. బీసీలను బిచ్చగాళ్ల కంటే హీనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని, బీసీ రిజర్వేషన్లు ఆత్మగౌరవానికి సంబంధించినవని, ఆత్మగౌరవంతో చెలగాట మాడొద్దన్నారు. ఇదే ప్రభుత్వాల విధానం అయితే మీ పీఠాలు కదిలి పోతాయని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఒకే మాటపై ఉందని, రాజ్యాంగంలోని తొమ్మిదో షె డ్యూల్లో చేర్చడమే సమస్యకు పరిష్కారమన్నారు. బీసీ రిజర్వేషన్‌పై కాంగ్రెస్‌కు దారులు కూడా అర్థం కావడం లేదన్నారు. ఢిల్లీకి పోయి చేయాల్సింది ధర్నాలు కాదు ప్రభుత్వాన్ని, పార్టీలను మెప్పించాలన్నారు. మోదీని దించుతా, రాహుల్‌ను ప్రధాని చేస్త అని, బీఆర్ఎస్ను తిట్టడం కోసమే సీఎం, మం త్రులు అందరు ఢిల్లీకి వెళ్లారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అని మాట్లాడడం సరికాదన్నారు.
బీఆర్ఎస్ వాళ్లు వస్తామంటే తీసుకెళ్లలేదని, ఢిల్లీకి వెళ్లి ఎవరినీ కలువలేదన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది సిద్దరామయ్య అని, ఆయనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. యా భై శాతం రిజర్వేషన్లు దాటొద్దని కోర్టు తీర్పులున్నాయని, కానీ కాంగ్రెస్‌కు అన్నీ తెలిసే 42 శాతం రిజర్వేషన్లంటూ మాటిచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానంగా సిరికొండ చెప్పారు.
42 శాతం రిజర్వేషన్లు, జనాభా ప్రకారం వాటిని సాధించుకోవడం, రాజ్యాధికారంలో సమ వాటాదారులయ్యే వరకు బీసీల పోరాటం ఎవరూ ఆపలేరన్నారు. బీసీ ఉద్యమాల కు బీఆర్ఎస్ అండగా ఉంటుందని సిరికొండ అ న్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు గుర్రం రవీందర్, పీఏసీఎస్ డైరెక్టర్ బగ్గి రమేశ్, దుంపల మహేందర్‌రెడ్డి, నిమ్మల మహేందర్, అడుప ప్రభాకర్, బేరుగు రాకేశ్, సుమన్, విజ య్, సారయ్య, చంద్రమౌళి, కర్ణాకర్ ఉన్నారు.