హనుమకొండ, డిసెంబర్ 19 : రక్తదానం చేసి ఒకరి ప్రాణాన్ని కాపాడాలని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ ఈసం నారాయణ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ(కో-ఎడ్యుకేషన్)లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధికంగా రక్తాన్ని ఇవ్వాలని, విద్యార్థులు ఇలాంటి రక్తదాన శిబిరంలో పాల్గొని సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలాలని, సమాజంలోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో, ప్రత్యేక ఆహ్వానితులుగా వరంగల్ ఆర్జేడీ ఏ.గోపాల్, ప్రిన్సిపల్ కే.శ్రీదేవి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.రాజ్‌కుమార్, అధ్యాపకులు సాంబశివయ్య, అరుణ్ ప్రభాత్, వివేక్, రాజేష్, వేణు, భవానీసాగర్, సీనియర్ అసిస్టెంట్ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.