‘ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలా.. 60 ఏళ్లు కన్నీళ్లు మిగిల్చిన కాంగ్రెస్ కావాలా? 2014 ముందు పాలకుర్తి నియోజకవర్గంలో తాగు నీటి పరిస్థితి ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు కరెంట్ ఎట్లుండే.. కేసీఆర్ వచ్చినాక ఎట్లుంది? ఎవరు కావాలో మీరే ఆలోచించుకోండి’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు అన్నారు. తొర్రూరు పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు. ఇది కేవలం ఎమ్మెల్యే ఎన్నిక కాదు.. దేశం తల రాత మార్చేది అని అన్నారు. ఈసారి మన నాయకుడు కేసీఆర్ ఢిల్లీని శాసించాలంటే ఎర్రబెల్లిని లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మీ మంత్రి పని తీరు ఎట్లుందో మన రాష్ర్టానికి వచ్చిన అవార్డులే చెబుతాయని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీల నాయకుల డైలాగులకు మోసపోవద్దని సూచించారు. అవతల పార్టీల వారు డబ్బులిస్తే తీసుకొని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కోరారు.
– మహబూబాబాద్, అక్టోబర్9(నమస్తే తెలంగా ణ)/తొర్రూరు
మహబూబాబాద్, అక్టోబర్9(నమస్తే తెలంగా ణ)/తొర్రూరు: ‘ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలా.. 60 ఏళ్లు కన్నీళ్లు మిగిల్చిన కాంగ్రెస్ కావాలా..స్కీంలు ఇచ్చే ప్రభుత్వం కావా లా.. స్కాంలు చేసే ప్రభుత్వం కావాలా.. 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా.. 3 గంట లు కరెంట్ చాలన్న కాంగ్రెస్ కావాలా.. ఇటు పక్క కారు ఉంటే..అటు పక్క బేకారుగాళ్లు ఉన్నారు. ఎవరు కావాలో మీరే ఆలోచించుకోండి’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తా రాకరామారావు అన్నారు. సోమవారం తొర్రూరు పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు ముఖ్య అతిథి గా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన ప్రజల్లు, కార్యకర్తల్లో చైతన్యాన్ని నిం పారు.ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ వాళ్లకు ప్రజలు గుర్తుకొస్తారని, అవి అయిపోగానే కనబడ కుండా వెళ్లిపోతారని విమర్శించారు.
ఎన్నికలు వచ్చినప్పుడు సంక్రాంతి పండుగకు గంగిరేద్దుల మాదిరిగా వచ్చి కనబడతారని ఎద్దేవా చేశారు. ఇక్కడెవరో పాలకుర్తి నియోజకవర్గం నుంచి అమె రికా, లండన్ నుంచి కొత్తగా దిగారని తెలిసిందని, అలాంటి వాళ్లు వందల కోట్లు డబ్బు సంచులు దించుతున్నారని ఆరోపించారు. వారి వద్ద నుంచి డబ్బులు కాదు..డాలర్లు తీసుకోండి.. కానీ ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కేవలం ఎమ్మెల్యే ఎన్నిక కాదని, దేశం తల రాత మార్చే ఎన్నిక అని అన్నారు. మీరు వేసే ప్రతి ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి కాదని.. కేసీఆర్‌కు అని గుర్తుంచుకోవాలని కోరారు. ఈసారి ఎన్నిక ల్లో మన నాయకుడు ఢిల్లీని శాసించాలంటే బీఆర్ ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావును లక్ష మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రజ ల మనిషి దయాకర్‌రావు కంటే మంచోడెవరున్నా రో ఒక్కసారి ఆలోచించుకోండని అన్నారు. ఈ రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌటింగ్ అని, ఈ రెండు కలిపితే సీఎం కేసీఆర్‌కు అచ్చొచ్చిన.. సంఖ్య ఆరు అని, మూడోసారి కేసీఆర్ ముఖ్య మంత్రి అవడం ఖాయమని అన్నారు.
రాష్ట్రం ఏ ర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో ఒకసారి ఇంటికి వెళ్లిన తర్వాత మనసు పెట్టాలన్నారు. ఓటు వేసే ముందు ఒకసారి బాగా ఆలోచించి వేయాలని విజ్ఞప్తి చేశారు. 2014 ముందు పాల కుర్తి నియోజకవర్గంలో మంచినీళ్లు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుంది. అప్పుడు కరెంట్ ఎట్లుండే.. కేసీఆర్ వచ్చినాక ఎట్లుంది. ఎవుసం ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుంది. గతంలో సంక్షేమం ఎట్లుండే ది.. ఇప్పుడు ఎట్లుంది అనే విషయం ఆలోచిస్తే ఎవరికి ఓటు వేయాలో మీకే తెలుస్తుందన్నారు. మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పని తీరు వల్ల 30శాతం అవార్డులు మన రాష్ర్టానికే వచ్చా యి. అలాంటిది మీ మంత్రి పని తీరు ఎట్లా ఉందో మన రాష్ర్టానికి వచ్చిన అవార్డులే చెబుతు న్నాయన్నారు. ఇలాంటి దయాకర్‌రావును ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి దయాకర్‌రావుకు ఓటేసి గెలిపించి ప్రగతిలో భాగస్వాములవ్వాలని పిలుపు నిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాటలు, డైలాగులు, బిల్డప్‌లు కొడితే పని అయితదా..అని ప్రజలను ప్రశ్నించారు. 2014 ముందు రాష్ట్రంలో ఏదైనా పల్లె గురించి చెప్పుకోవాలంటే ఒక్క గంగ దేవిపల్లి గ్రామం గురించే చెప్పుకునేవారు. ఇప్పు డు వందల సంఖ్యలో గంగదేవిపల్లి గ్రామాలుగా మారాయన్నారు. నిన్న మొన్న ఒక కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతూ కరెంటు ఎక్కడ వస్తుందని అంటు న్నారు.
ఈ సందర్భంగా నేను కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులకు ఒక బంఫర్ ఆఫర్ ఇస్తున్నా.. ‘మంత్రి దయాకర్‌రావుకు చెప్పి వంద బస్సులు పెట్టిస్తా.. ఇందులో యాభై బస్సులు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, మిగతా యాబై బీజేపీ వాళ్లకు ఏర్పాటు చేయిస్తా.. ఆ బస్సుల్లో ఆ పార్టీలకు చెందిన అగ్రశే ణి నాయకులంతా రండి.. పాలకుర్తి నియోజక వర్గంలో ఏ ఊరికి పోతారో పోండి..ఆ ఊరిలో ఉన్న కరెంట్ వైర్లను పట్టుకొని చూస్తే కరెంట్ ఉన్న ది లేనిది తెలుస్తుంది..తెలంగాణకు పట్టిన పీడ పోతుంది’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాలిపోయే మోటర్లు, పెలలిపోయే ట్రాన్స్ఫార్మర్లు చూశామని, రాత్రి పూట కరెంట్ ఇస్తే పాము, తేలు కుట్టి చనిపోయిన రైతు కు టుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. రూ. 40వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్ర శ్నించారు.
సాగు నీరు, 24గంటల కరెంట్, రైతు బందు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, ఆడ పిల్లలకు కల్యాణలక్ష్మి, గర్భిణులకు కేసీఆర్ కిట్ ఇలా అనేక పథకాలు ఇచ్చి ప్రజలకు ఇచ్చి ఆదుకుంటున్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. అవతల పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకోండి..ఇమానం..పమానం వదిలేయాలి..ఓటు మాత్రం కారు గుర్తుకు వేయా అన్నారు. మోసాన్ని మోసంతోటే జయించాలన్నా రు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి 11 చాన్స్ లు ఇస్తే..ఏం చేసింది..ఇప్పుడు మళ్లీ ఒక్క చాన్స్ ఇవ్వండని అడుగుతున్నారు..కాంగ్రెస్ పార్టీ నా యకులను గ్రామాల్లో నిలదీయండని ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యు డు వద్దిరాజు రవిచంద్ర, వరంగల్, మహబూబా బాద్ ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్లు అంగోత్ బిందు, గండ్ర జ్యోతి, రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉష, మున్సిపల్ చైర్మన్ మంగళ పల్లి రామచంద్రయ్య, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పీఏ సీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మండల అభి వృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పీ సోమేశ్వర్రావు, రైతుబంధు జిల్లా సమితి సభ్యుడు రామసహా యం కిశోర్‌రెడ్డి, మండల రైతు బంధు కో-ఆర్డినే టర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, మండల, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, రామిని శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరా వు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తొర్రూరులో కేటీఆర్ రాక సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మున్సిపా లిటీలో 2వ వార్డు కౌన్సిలర్‌గా, కాంగ్రెస్ నాయ కురాలిగా సుదీర్ఘకాలంగా పని చేస్తున్న తూనం రోజాతో పాటు యువజన కాంగ్రెస్ నాయకుడు తూనం శ్రావణ్, చెర్లపాలెం గ్రామానికి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్ పెరటి యాకూబ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పెరటి నర్మద, బీజేపీ సీనియర్ నేత అనుమాండ్ల ప్రదీప్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరగా మంత్రులు కేటీఆర్, దయా కర్రావులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించా రు. ఈ చేరికలు కాంగ్రెస్‌కు ఉహించని షాక్ తగిలింది.