నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. గురు, శుక్రవారాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర నోములు, సత్యనారాయణ వ్రతాలు జరుపుకున్నారు. స్వీట్లు, పిండి పదార్థాలు తయారుచేసి దేవుడికి నైవేద్యం సమర్పించారు.
ఊరూరు దీపాల కాంతులతో కళకళలాడాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా కాల్చిన పటాకులు అమావాస్య చీకటిలో వెలుగులు నిం పాయి. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.