సంగెం, సెప్టెంబర్ 24: అవినీతి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఆశాలపల్లి క్రాస్‌రోడ్డు గార్డెన్స్‌లో ఆదివారం మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 610 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఎంపీపీ కందకట్ల కళావతి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం నిరుపేదలకు వరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు ఆరు గ్యారెంటీలను ఎక్కడ ఇస్తుందని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీ రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలు ఆచరణకు సాధ్యం కావన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో కాంగ్రెస్ నాయకులకు నిద్రపట్టడం లేదన్నారు. మతతత్వ బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఇంటి కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. స్థలం ఉండి ఇల్లులేని అర్హులైన నిరుపేదలందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. దీని కింద రూ.3లక్షలు ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లోనే వేస్తుందని తెలిపారు.
బేస్మెంట్ లెవల్‌కు రూ.లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.లక్ష, గోడలు, ప్లాస్టరింగ్ పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష ఇస్తుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ పచ్చటి పొలాలతో కోనసీమలా మారిందన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో వలస పోయిన వారు తిరిగి గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ సీఎంగా పదికాలాల పాటు ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. మళ్లీ మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేసుకోవాలన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతరం కొనసాగుతుందని, ఇంటి మంజూరు కోసం ఎవరికైనా డబ్బులు ఇస్తే తనకు తెలియజేస్తే దాన్ని నిలిపివేస్తామని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తనకు ఫోన్ చేయాలని సూచించారు. డీఆర్డీవో ఎం.సంపత్‌రావు, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, తహసీల్దార్ రాజ్‌కుమార్, కందకట్ల నరహరి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ఏఎంసీ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, సర్పంచ్‌లు సాగర్‌రెడ్డి, బాబు, కిశోర్‌యాదవ్, జయశ్రీ, రమ, కుమారస్వామి, ఎంపీటీసీలు గుగులోత్ వీరమ్మ, బాలకృష్ణ, మల్లయ్య, పద్మ, దుర్గారావు, నర్సింహస్వామి, సొసైటీ చైర్మన్లు కుమారస్వామి, డీ.సంపత్, నాయకలు దొనికెల శ్రీనివాస్, ఉండీల రాజు, కొనకటి మొగిలి, శ్రీనివాస్, మోహన్, దొనికెల మల్లయ్య పాల్గొన్నారు.
పేదలను అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జీఎస్ఆర్ గార్డెన్స్‌లో ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన 428 మంది గృహలక్ష్మీ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకే సీఎం కేసీఆర్ గృహలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఆత్మకూరు మండలానికి 309 మంది లబ్ధిదారులకు, దామెర మండలానికి 119 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మీ పథకంలో మంజూరైన పత్రాలను అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. పదేళ్ల క్రితం తెలంగాణ ఎట్లా ఉండే, ఎంత గోసపడ్డాం.. ఇప్పుడు తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న కృషితో ఎలా ఉందో ఆలోచించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు తెలంగాణకు ఏమి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు.
లేకుంటే ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పుదన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు అచరణ సాధ్యం కానీ హామీలను ఇస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఏనాడో నమ్మకం పోయిందన్నారు. కర్ణాటకలో సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయడంలేదన్నారు. అదే తరహాలో తెలంగాణలో చేయాలని చూస్తోందన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాలు ఏండ్లకేండ్లు అధికారంలో ఉండి ప్రజలను, రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వ్యవసాయానికి 3గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెసోళ్ల అవగాహన లేని మాటలు, బావులకాడ మీటర్లు పెట్టాలంటున్న బీజేపోళ్ల తీరు తెలుస్తోందన్నారు. మాయ మాటల కాంగ్రెస్, తెలంగాణ ద్రోహిగా నిలిచిన బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఎంపీపీ మార్క సుమలత, కాగితాల శంకర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, కల్పన, వైస్ ఎంపీపీలు రేవూరి సుధాకర్‌రెడ్డి, జాకీర్‌అలీ, ఆత్మకూరు, దామెర తహసీల్దార్లు సురేశ్‌కుమార్, జ్యోతి, ఎంపీడీవోలు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, ఆత్మకూరు, దామెర మండలాల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, గండు రాము, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు వంగాల భగవాన్‌రెడ్డి, పాపని రవీందర్, ఎండీ అంకూస్, పూజారి రాముపటేల్, వీర్ల వెంకటరమణ, బాషబోయిన పైడి, బాషబోయిన సదానందం, రేవూరి ప్రవీణ్‌రెడ్డి, ఆత్మకూరు, దామెర మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.