‘ఎంపీ రేవంత్‌రెడ్డివి అనాగరిక మాటలు. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు. ఎంపీగా ఉండి కులాలను కించపర్చడం దారుణం.’ అని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ధ్వజమెత్తారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం బాలసముద్రంలోని ఏకశిల పార్ వద్ద ఆత్మగౌరవ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అహంకార పూరితంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని, యాదవులు, బీసీలకు రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
– హనుమకొండ, మే 18
హనుమకొండ, మే 18 : బుద్ధి, జ్ఞానం లేకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవులు, బీసీ కులాలకు టీపీసీసీ చీఫ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గు రువారం బాలసముద్రంలోని ఏకశిల పార్ వద్ద నిర్వహించిన ఆత్మ గౌరవ ధర్నా నిర్వహించారు. దున్నపోతుతో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తొకించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహ నం చేశారు. అనంతరం చీఫ్ విప్ మా ట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నా రు. ఎంపీ పదవిలో ఉండి కులాలను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. అహంకార పూరితంగా వ్యవహరించే రాజకీయ నాయకులు, పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని హె చ్చరించారు. ఏ కులం ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినా ఊరుకునేది లేదని, అన్ని వర్గాలు, కులాలకు సీఎం కేసీఆర్ అండ గా ఉంటున్నారన్నారు. కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ యాదవ జాతిని అవమాన పరిచేలా మాట్లాడిన రేవంత్‌రెడ్డి 24లోపు యాదవ సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్‌కు సమాధి కడుతామని హెచ్చరించారు. గొల్ల, కురుమ సంఘా ల జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ మాట్లాడుతూ యాదవ కాకతీయులు నాటి తెలంగాణను పాలించారని, వారి జోలికొస్తే రేవంత్‌రెడ్డికి ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్నారు.
యాదవులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే 25న కాంగ్రెస్ భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ ఉద్యమకారుల సంఘం చైర్మన్ రాజారాం యాదవ్ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ఖబర్దార్, నోరు, మాట జాగ్రత్త, అహంకార పూరిత మాటలు మానుకోవాలని గొల్ల, కురుమల సంఘం జేఏసీ కన్వీనర్ కడారి అంజయ్య యాదవ్ అన్నారు. దున్నపోతులు, పొట్టేళ్లతో గాంధీభవన్‌ను ముట్టడిస్తామని అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు లోడంగి గోవర్ధన్ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి తక్షణమే యాదవ సమాజానికి క్షమాపణ చెప్పాలని అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గిరబోయిన రాజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. యాదవుల జోలికొస్తే రేవంత్‌రెడ్డికి రాజకీయ సమాధి కడతామని అఖిల భారత యాదవ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొల్లబోయిన కిశోర్ యాదవ్ అన్నారు. యాదవుల మనోభావాలను కించపరిచేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించేది లేదని అఖిల భారత యాదవ మహాసభ జనగామ జిల్లా అధ్యక్షుడు బనక సిద్ధిరాజ్ యాదవ్ అన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, మామిండ్ల రాజు యాదవ్, బైరబోయిన దామోదర్ యాదవ్, జకుల శ్రీనివాస్ యాదవ్, కావటి కవితా యాదవ్, ఐనవోలు దేవస్థానం చైర్మన్ జయపాల్ యాదవ్, గొర్రెలు, మేకల పెంపకందారుల సంక్షే మ సంఘం అధ్యక్షుడు బొజ్జ రవీందర్ యాదవ్, నాయకులు రవి యాదవ్, రాహుల్ యాదవ్, కృష్ణమూర్తి యాద వ్, ఆబోతు రాజు యాదవ్, జక మల్లయ్య, ఎల్లావుల కుమార్ యాదవ్, రాజేందర్ యాదవ్, అశోక్ యాదవ్, రాజయ్య యాదవ్, దాడి రమేశ్ యాదవ్, భిక్షపతి యాదవ్, రాకేశ్ యాదవ్, రాజు యాదవ్, రవి యాదవ్, యుగేంధర్ యాదవ్, జ్యోతి, సునీత, విజయ, రాధ, సులోచన, శారద, భాగ్యలక్ష్మి, హైమావతి పాల్గొన్నారు.