హనుమకొండ చౌరస్తా ఏప్రిల్ 24: ఆరు రోజులుగా రాష్ట్రంలో 12 యానివర్సిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ తో చేస్తున్న సమ్మెకు గురువారం మాజీ ఎమ్మెల్యే మూర్తినేని ధర్మారావు, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మంద కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి సూరం ప్రభాకర్ రెడ్డిలు విచ్చేసి తమ మద్దతును తెలియజేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు సెకండ్ గేటు వద్దకి డప్పుచప్పులతో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించి వారు మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను రెగ్యులరైజ్ చేసేటటువంటి ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడిన వాటిని పరిష్కరించే దిశగా యూజీసీతో మాట్లాడతామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీలను సజీవంగా నిలబెట్టడానికి కాంట్రాక్ట అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డా. పీ కరుణాకర్ రావు, డా. ఆశీర్వాదం, డా. శ్రీధర్ కుమార్ లొద్, డా. సాదు రాజేష్, డా. జూల సత్య, డా. ఆరూరి సూర్యం, డా. సూర్యనారాయణ, డా. చంద్రశేఖర్, డా. నాగయ్య, డా. రఘు వర్ధన్ రెడ్డి, డా. మధుకర్, డా. శ్రీనువాష్,సిద్ధార్థ, డా. ప్రణీత డా. శ్రీదేవి, డా. శ్రీలత,డా. కవిత, డా. సరిత,డా. స్వప్న, డా. కల్పన,డా. వాణిశ్రీ, శ్రీజ, దీప్తి డా. పరినఫాతిమా, డా. రేఖ, డా. సునీత , డా. గడ్డం కృష్ణ, డా. సుచరిత పాల్, తూర్పటి వెంకటేష్, కిషన్, డా. సతీష్ కుమార్,డా. బ్రహ్మం, డా. ప్రసాద్,డా. సాయిచరణ్, డా. స్వామి,,డా. రాజు తదితరులు పాల్గొన్నారు.