మార్మోగిన గోవింద నామస్మరణ
గోవింద నామస్మరణతో కోటంచ మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తజనం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. కోరిన కోర్కెలు నెరవేరినందుకు స్వామి వారికి ఏనుగు వాహనాలు, మేకలు, గుర్రం బండ్లను ప్రత్యేకంగా తయారు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
- వైభవంగా కోటంచ జాతర.. ప్రత్యేక ఆకర్షణగా ఏనుగు బండ్లు
రేగొండ, మార్చి 25 : గోవింద నామస్మరణతో కోటంచ మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తజనం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. కోరిన కోర్కెలు నెరవేరినందుకు స్వామి వారికి ఏనుగు వాహనాలు, మేకలు, గుర్రం బండ్లను ప్రత్యేకంగా తయారు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు, తాగునీటి వసతి, స్నానఘట్టాలు, తదితర ఏర్పాట్లుచేశారు. ఆలయ చైర్మన్ మల్కనూరి భిక్షపతి, ఈవో బీ శ్రీనివాస్, ధర్మకర్తలు శ్రీపతి సుదర్శన్, మూల ఓంకార్, మల్లెబోయిన శ్రీధర్, డోలి కోటేశ్వర్రావు, జోగేందర్, గుర్రాల శ్రీనివాస్‌రెడ్డి, కళావతి, లక్ష్మి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైద్యాధికారి హిమబిందు ఆధ్వర్యంలో భక్తులకు వైద్య సేవలందిస్తున్నారు. ఎన్ఎస్ఆర్ సంస్థల ఆధినేత నాయినేని సంపత్‌రావు భక్తులకు 30వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

