తాడ్వాయి, డిసెంబర్ 24 : మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులతో కిక్కిరిసింది. ముందుగా భక్తులు తల నీలాలు సమర్పించి, జంపన్నవాగులో స్నానాలు చేశారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును దర్శించుకుని పసుపు, కుంకుమ, సారె, పూలు, పండ్లు సమర్పించుకున్నారు. పిల్లా పాపలు సల్లంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. పరిసర ప్రాంతాల్లో సహపంక్తి భోజనాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. ఎస్ఐ ఓంకార్యాదవ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.