కరీమాబాద్, సెప్టెంబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 39వ డివిజన్లోని క్యాంపు కార్యాలయంలో 32వ డివిజన్ నుంచి కార్పొరేటర్ పల్లం పద్మారవి, 41వ డివిజన్ నుంచి కార్పొరేటర్ పోశాల పద్మాస్వామి గౌడ్ ఆధ్వర్యంలో పలు పార్టీల నుంచి యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురులేదన్నారు. అభివృద్ధ్ది, సంక్షేమంతో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారన్నారు. పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి అండగా ఉంటామన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీలోని కొత్తా.. పాత అని తేడా లేకుండా నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంత్రి కేటీఆర్ అండదండలతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపడతామన్నారు. బీఆర్ఎస్లోనే సామాన్యులకు సైతం అవకాశాలు వస్తాయన్నారు.
పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను ఎండగట్టాలన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రజల కోసం చేస్తున్న పనులను క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోశాల పద్మాస్వామి గౌడ్, సిద్ధం రాజు, పుర్ఖాన్, మాజీ కార్పొరేటర్ పల్లం రవి, 32వ డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, నాయకులు కే రమేశ్, ఈదుల భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే మైనార్టీలకు సముచిత న్యాయం
కాశీబుగ్గ: సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఆ యాంలోనే ముస్లిం మైనార్టిలకు సముచిత న్యాయం జరు గుతోందిని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేం దర్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఓసిటిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 18వ డివిజన్‌కు చెందిన టీఆర్టీ, ఎస్ఆర్టీ కాలనీలకు చెందిన మైనార్టీ యూత్ సభ్యులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో 50 మంది చేరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్ రాజేందర్, ఉమాదేవి, మైనార్టీ నాయకులు ఎండీ రియాజ్, ఇర్ఫాన్, యాసిన్ పాల్గొన్నారు. అనంతరం గజమాలతో ఎమ్మెల్యే నరేందర్‌ను ముస్లింలు ఘనంగా సన్మానించారు.