కృష్ణ కాలనీ, సెప్టెంబర్ 24: సింగరేణి కా ర్మికులకు వాస్తవ లాభాల వాటా 33 శాతం చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య డి మాండ్ చేశారు. కార్మికులకు 16.9 శాతం లాభాల వాటాను ఇస్తానని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేం ద్రంలోని అంబేదర్ సెంటర్లో రాష్ట్ర ప్ర భుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ స గం మాత్రమే చెల్లిస్తానని రాష్ట్రప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మిక కుటుంబాల పొట్టగొట్టే ప్రయత ్నం చేస్తున్నదని మండిపడ్డారు.
కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు నల్లవెల్లి సదానందం, కేంద్ర ఆర్గ నైజింగ్ సెక్రటరీ దే వరకొండ మధు, బాసనపల్లి కుమారస్వా మి, జీ రామచందర్, అన్నాడి మల్లారెడ్డి, న రేశ్నేత, రాజేందర్, లక్ష్మణ్, గువ్వల శంకర్, భోగం నరేందర్, రమేశ్, ఆకుల కిషన్ రెడ్డి, కిరణ్, విజేందర్ రెడ్డి, టేకుమట్ల రాజయ్య, రమణారెడ్డి, రాజేశ్వరరావు పాల్గొన్నారు.