హనుమకొండ చౌరస్తా, మే 21: పాఠశాలల్లో అమలు అవుతున్న కార్యక్రమాలకు సంబంధించి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ తమ పాఠశాలలో ఆచరించే బెస్ట్ ప్రాక్టీస్ నమోదు గడువు ఎస్సీఈఆర్టీ పెంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి తెలిపారు.
ప్రభుత్వ, స్థానిక సంస్థల, కేజీబీవీల, తెలంగాణ మోడల్ పాఠశాలల, తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్‌కు సంబంధించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈనెల 22వ తేదీలోగా ఎస్సీఈఆర్టీ వెబ్సైట్ అయిన https://scert.telangana.gov.in లో నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే ఎస్సీఈఆర్టీ ఫ్యాకల్టీ మెంబర్ డి.మధుసూదన్‌రెడ్డిని 97058 06579 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.