మహబుబాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఓటర్లు పాల్గొనాలని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ పిలుపు నిచ్చారు. తన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కురవి మండ లం పెద్దతండాలోని బూత్ నంబర్ 68లో ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి బీఎల్వోకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాన్యుల చేతిలో బలమైన ఆయు ధం ఓటు హక్కు అని, ప్రతి ఒక్కరూ తప్పకుం డా నమోదు చేసుకోవాలన్నారు. సర్పై అవగాహన లేక గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇంటి వద్దనే పెట్టకుంటున్నారని, ఎలా నిం పాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు.
ఇప్పటికీ అనేక సందేహాలతో స్వీకరణ ప్రక్రియ ఆలస్యమవుతున్నదన్నారు. ఈఎఫ్ల స్వీకరణకు ఈ నెల 24 వరకు చివరి తేదీ ఉండగా, కేవలం 15 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయిందని, అందువల్ల గడువు పెంచాలని కోరారు. అలాగే సర్పై ఇప్పటికీ అనేక సందేహాలున్నాయని, వాటిని అధికారులు నివృత్తి చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యతో బీఎల్వోలు డిజిటలైజేషన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారని, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలన్నారు. బీఎల్వోలుగా అంగన్వాడీ టీచర్లను నియమించారని, వారు పాఠశాల విధులు, మరో వైపు సర్ ప్రక్రియను చేపట్టలేక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. అంగన్వాడీ టీచర్లను బీఎల్వో విధుల నుంచి తొలగించాలని, లేదం టే పని ఒత్తిడి లేకుండా చూసుకోవాలన్నారు. సర్పై ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తలు పాటించాలని సత్యవతి సూచించారు. ఆమె వెంట జడ్పీ మాజీ చైర్ పర్సన్ బిందు ఉన్నారు.