న్యూశాయంపేట, ఏప్రిల్ 17: బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతి గడపకూ సంక్షేమం అందుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 30,31వ డివిజన్ల కార్యకర్తలతో సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. హను మకొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వొడితల సతీశ్ బాబు, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్‌బాబుతో కలిసి కార్యకర్త లకు చీఫ్ విప్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై గల్లీగల్లీలో చర్చ జరగాలని అన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై గల్లిగల్లిలో చర్చ జరగాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హంటర్ రోడ్డులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 30, 31వ డివిజన్ల కార్యకర్తలతో సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. హనుమకొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ పాల్గొనగా, చీఫ్ విప్ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ కార్యకర్తలే మన బలగం.. బలమని అన్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఓట్లప్పుడు వచ్చే రాజకీయ పార్టీ నాయకుడిని కాదని, నిత్యం మీతో ఉంటూ మీలో ఒకడిగా ఉంటానని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వ లేని ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని అన్నారు.
నాడు తెలంగాణలో కరువులు.. నేడు పచ్చని పంట పొలాలు, పాడి పశువులు, గోదావరి జలసిరులతో అలరారుతోందన్నారు. ఇప్పుడు రాజకీయం చేయడానికి కొందరు నాయకులు వస్తున్నారని, వారు వరదలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో పోటీపడిన వ్యక్తులు ఆ తర్వాత కనుమరుగయ్యా రని అన్నారు. తాను మా త్రం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మధ్యే ఉన్నానని గుర్తు చేశారు. నగర జనాభా అధికంగా ఉన్నా నియోజకవర్గంలోనూ రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలవుతున్నాయన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యలక్ష్మి, తదితర వినూత్న కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు సైతం అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం తరఫున పట్టాలు అందిస్తామని అన్నారు. డివిజన్లోని ప్రతి కుటుంబం బీఆర్ఎస్ పార్టీ లబ్ధిదారులే అని అన్నారు. 60 లక్షల సభ్వత్వంతో బలమైన శక్తిగా గులాబీ పార్టీ అవతరించిందన్నారు. అనంతరం 30, 31వ డివిజన్ల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మామిండ్ల రాజు, చెన్నం మధు, మాజీ కార్పొరేటర్లు మాడిశెట్టి శివశంకర్, జోరిక రమేశ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు వెంకన్న, అనిల్‌కుమార్, నాయకులు తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, గుండు సదానందం పాల్గొన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమం ఏది?
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎలాంటి ఆసరా పెన్షన్లు లేవు. రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క పథకమూ అందించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోని వచ్చిన తర్వాతే రాష్ట్రం లో 24గంటల విద్యుత్ అందుతోంది. ప్రజల శ్రేయస్సు కోరే నాయకుడు వినయ్‌భాస్కర్. నిత్యం ప్రజలకు అందు బాటులో ఉంటూ, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.
– ఎంపీ పసునూరి దయాకర్
దేశ్‌కీ నేత కేసీఆర్
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు యావత్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాయి. 24 గంటల విద్యుత్‌తో పాటు రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో తాగునీటి ఇబ్బందులు తొలిగాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు ఆయను దేశ్‌కీ నేతగా చూడాలనుకుంటున్నారు.
– జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు
అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంతు కావడం ఖాయం. దేశం గర్వించేలా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నిరంతరం ప్రజ ల్లో ఉండి భరోసా కల్పించాలి. ప్రతిపక్షాల దుష్ప్రచారం తిప్పికొట్టాలి. ఇంటి ముందు అభివృ ద్ధి..కంటి ముందు అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్.
– రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్