నయీంనగర్, మే31 : కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వీ ర్యం చేస్తున్నాయని, వాటి మెడలు వంచి ఉద్యమాలతో హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొం డ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా శనివారం బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనం (ఏకశిల పారు) ఎదుట వివిధ కార్మిక సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేలాది మంది చిరు వ్యాపారుల కుటుంబాలను మున్పిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వేధించడాన్ని ఆపేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారుల రక్షణ కోసం చట్టం తెచ్చేలా నాడు బీఆర్ఎస్ ఎంపీలు ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు అనేక రుణాలు అందించామని, వెండింగ్ జోన్లు ఏర్పాటు చేశామన్నారు. 2014 లో తీసుకొచ్చిన చిరు వ్యాపారుల రక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా కార్మిక శాఖకు మంత్రి ని నియమించకపోవడం కార్మికులపై వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కార్మికులకు ఏమీ చేయని కాంగ్రె స్ సర్కారు, భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను మళ్లించిందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలో కేటాయించిన 2,600 గజాల స్థలంలో కార్మిక భవన్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. జూన్ 9న దేశ వ్యాప్తంగా జరుగనున్న సార్వత్రిక సమ్మెలో ప్ర కార్మిక సంఘం.. కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్ట కొట్టిందని, వారికిచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ. 12,000 భృతి ఇవ్వాలని, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ఆదుకోవాలని దాస్యం డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, నాయిని రవి, ఎంజాల మల్లేశం, ఈసంపల్లి సంజీవ, రవీందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, జయరాం, తేలు సారంగపాణి, రఘుపతిరెడ్డి, శివకుమార్, కాటపురపు రాజు, రాజారపు రాజు, భిక్షపతి, రఘు, కృష్ణ, రాజు, ఎండీ ఇస్మాయిల్, గుంజ స్వామి, కొండయ్య రవి, మా తెలంగాణ, ప్రతాపరుద్ర ఆటో యూనియన్ నాయకులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.