హనుమకొండ, మార్చి 17: రాష్ట్రంలో అభివృద్ధి లేని పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర, సైకో మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నీతి, నిజాయితీ లేని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిన్నటి సభలో ఏమీ తెలియనట్లు ఉన్నాడని.. ఆయన తీరు చూస్తే స్టూడెంట్ ముందు లెక్చరర్ నిల్చున్నట్లుందని ఎద్దేవా చేశారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర సీఎంలు వైఎస్ఆర్, కిరణ్‌కుమార్‌రెడ్డిలాగే స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన సభ సందర్భంగా గ్రామాలను పోలీసులతో నిర్బంధించారని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో పాటు హౌస్ అరెస్ట్ చేశారన్నారు. ఉప ఎన్నికలు వస్తాయనే భయంతోనే స్టేషన్‌ఘన్‌పూర్‌లో సభ ఏర్పాటు చేశారన్నారు.
మూలన కూర్చున్న కడియంను కేసీఆర్ పిలిచి పదవులిస్తే బీఆర్ఎస్కు ద్రోహం, మోసం చేశాడని, అవి ఆయనను వెంటాడుతాయన్నారు. అభివృద్ధి జరగలేదన్న కడియం శ్రీహరి ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్నది నీవు కాదా? అని ప్రశ్నించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎపుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యనేనని స్పష్టం చేశారు. కడి యం శ్రీహరికి నమ్మకముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలని సవాల్ విసిరారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తిచేసి ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్ పోర్ట్, గిరిజన విశ్వవిద్యాలయం కోసం కొట్లాడింది కేసీఆర్, బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం, నాయకులు ప్రజలను మ భ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, సరైన సమయంలో బుద్ది చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారని పే ర్కొన్నారు. సమావేశం లో కుడా మాజీ చైర్మ న్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ ని యోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాం త్, మైనార్టీ నాయకు డు నయీముద్దీన్, నా యకులు జానకి రాము లు, రమేశ్, రామ్మూర్తి, వెంకన్న పాల్గొన్నారు.
గాడ్నే వారసడు సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ విధ్వంసానికి సూచిక. తెలంగాణ హంతకుడు. ఆదివారం జరిగిన సభలో రేవంత్‌రెడ్డి కేసీఆర్, ఆయన కుటుంబంపై అసభ్యకరంగా మాట్లాడారు. మాకు ఓపిక నశించింది. ఇకపై రేవంత్‌రెడ్డి తీరులోనే మా సమాధానం ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ సాధకుడు. పదేండ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిపై మార్చురీ అంటూ మాట్లాడాడు. రానున్న రోజుల్లో రేవంత్‌కు మార్చురీ తప్పదు. అధికారిక వేదికపై రాజకీయాలు మాట్లాడాడు.
రేవంత్‌రెడ్డి అయ్య సొమ్ము కాదు.. కడియం శ్రీహరి సొత్తు కాదు.. అది ప్రజల సొమ్ము. కేసీఆర్ నిజంగా తెలంగాణ జాతిపితే. సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కువ తక్కువ మాట్లాడితే నాలుక తిరగకుండా బీఆర్ఎస్ చేస్తుంది. రేవంత్‌రెడ్డి భాషతో తెలంగాణ రాజకీయాల్లో ఏం మార్పు తీసుకొస్తున్నాడు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? బీఆర్ఎస్కు ద్రోహం చేసిన కడియం కోసం పోయిండు అంటే రేవంత్ ఎటువంటివాడో, ఎవరికి కొమ్ముకాస్తున్నాడో అర్థమవుతున్నది. నేడు కాంగ్రెస్ హయాంలో విధ్వంసం, దోపిడీ, అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడితే అందులో కడియం శ్రీహరి వాటా ఎంత? ప్రజల్లో ఉండాలి తప్ప చిల్లర మాటలు మాట్లాడొద్దు.
– మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రజాపాలన సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తిట్లకు సీఎం రేవంత్‌రెడ్డి జాతిపిత. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 1.62 లక్షల కోట్లు అప్పు చేస్తే, బీఆర్ఎస్ హయాంలో రూ. 4,17,496 కోట్లు అప్పు చేసిందని, ఆస్తులు, వనరులు సమకూర్చి దేశానికి ఆదర్శవంతమైన పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారు.
కాంగ్రెస్ చేసిన అప్పుల్లో కొంత ఢిల్లీకి, రాహుల్గాంంధీకి కప్పం కడుతున్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధించి నాలుగు కోట్ల మంది ప్రజల గుండెల్లో నిలిచారు. తిన్నింటి వాసాలు లెకపెట్టే వ్యక్తి కడియం శ్రీహరి. అన్ని పదవులు అనుభవించి బిడ్డకు టికెట్ ఇచ్చినా పార్టీని మోసం చేశాడు. కడియం అవినీతిపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం సస్యశ్యామలమైంది.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తే.. ఏడారిలా మార్చింది కడియం కాదా? ఒకప్పుడు రేవంత్‌రెడ్డే కడియం శ్రీహరి కులంపై మాట్లాడుతూ శీల పరీక్ష చేయించుకోవాలని అన్నాడు. అదే రేవంత్ పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. ఇదే శ్రీహరి కాంగ్రెస్ సరారు 6 నెలల్లో కూలిపోతుందని అన్నాడు. సీఎం రేవంత్‌రెడ్డి, కడియం శ్రీహరివి భిన్న వ్యక్తిత్వాలు. వారిది అపవిత్ర కలయిక. పార్టీ మారిన నేతతందరూ సైలెంట్‌గా ఉంటే కడియం మాత్రం ఎకువ తకువ మాట్లాడుతున్నాడు. ఆయనకు కర్రుకాల్చి వాత పేట్టేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు.
– తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే