హనుమకొండ, అక్టోబర్ 3 : మంత్రి కొండా సురేఖ దినీచ రాజకీయమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజమెత్తా రు. కేటీఆర్‌పై అసత్య ఆరోపణలు చేయడం తగదని, వెంటనే ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డి మాండ్ చేశారు. గురువారం మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఒక మంత్రిగా ఉండి తోటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేటీఆర్‌పైకి నెట్టడాన్ని మ హిళా లోకమంతా ఖండిస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన 420 హామీలు, 6 గ్యా రెంటీలు అమలుచేసేంత వరకు పోరాడుతామని స్ప ష్టం చేశారు.
రూ. 1.50 లక్షల కోట్లతో మూసీ నదిని అభివృద్ధి చేస్తామంటూనే హైడ్రా పేరుతో పేదల ఇండ్లు, గుడిసెలు కూల్చివేస్తున్న నేపథ్యంలో ప్రజలు కేటీఆర్, బీఆర్ఎస్పై చూపుతున్న అభిమానాన్ని తట్టుకోలేకే వి మర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే విమర్శలకు దిగుతూ డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పరీవాహక మహిళలు ఏడుస్తుంటే అండగా ఉంటున్న కేటీఆర్‌పై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనకితీసుకోవాలని ఆయన డిమాం డ్ చేశారు.
మీ చరిత్ర, మీ కుటుంబ చరిత్ర తెలంగాణ ప్రజానీకానికి తెలుసని ఎద్దేవాచేశారు. మంత్రి హోదా లో ఉండి ఇతరుల కుటుంబ విషయాలు మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. మంత్రి హోదాలో ఉ న్న నిన్ను కల్యాణ లక్ష్మితోపాటు తులం బంగారం, వి ద్యార్థినులకు స్కూటీలు, మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. రెండు నెలలకోసారి కొత్త డ్రామాతో బీఆర్ఎస్పై కాంగ్రెస్ అ సత్య ప్రచారానికి తెరలేపుతున్నదని దాస్యం ధ్వజమెత్తారు.
మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడు తూ మంత్రి కొండా సురేఖ అనాలోచిత మాటలకు మ హిళలు బాధ పడుతున్నారని అన్నారు. కేటీఆర్‌పై చేసిన ఆరోపణలను నిరూపించు.. లేకుంటే మాటలు వాపస్ తీసుకో.. లేనిపక్షంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, నియోజక వర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, బీఆర్ఎస్ నాయకులు నయీముద్దీన్, రెంటాల కేశవరెడ్డి, పెరకారి శ్రీధర్‌రావు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.