కాజీపేట, నవంబర్ 30 : గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ దశలవారీగా చేసిన పోరాటాల ఫలితంగానే కాజీపేట ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట రైల్వేస్టేషన్ ఎదుట శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ ప్రాంత ప్రజల 45 ఏండ్ల ఆకాంక్ష మేరకే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైందన్నారు. సమైక్య రాష్ట్రంలో కాజీపేటకు తీవ్ర అన్యాయం జరిగిందని, కోచ్ ఫ్యాక్టరీ రావడంలో కాంగ్రెస్ పా ర్టీ పాత్ర ఏమీలేదన్నారు. నిజాం కాలం నుంచి రైల్వే కార్మికు లు, కార్యాలయాలతో కళకళలాడిన కాజీపేట జంక్షన్, కాంగ్రెస్ పాలనలో వెలవెలబోయిందన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పా టు సమయంలో ఉద్యమ నేత కేసీఆర్ ముందుచూపుతో ఉ మ్మడి జిల్లాలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, ములుగు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచేలా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. గతంలో కాజీపేట నుంచి తరలిపోతున్న పలు రైల్వే ముఖ్య కార్యాలయాలను కాపాడిన ఘ నత బీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. కాజీపేటలో ఏర్పాటు కా నున్న కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 60శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని అర్హతలున్న కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్ హోదాకు వెంటనే అప్‌గ్రేడ్ చేయాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాజీపేట అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశామని పేర్కొన్నారు.
కాజీపేట బోడగుట్టకు పుట్ ఓవర్ బ్రిడ్జికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.5 కోట్ల నిధులను కేటాయించి, రైల్వే సహకారంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాల ని డిమాండ్ చేశారు. కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీనీ తామే తెచ్చామని ప్రజాప్రతినిధులు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. అనంతరం కాజీపేటలో రైల్వే వ్యాగన్, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 36 రోజుల రిలే నిరాహార దీక్షలకు కన్వీనర్‌గా వ్యవహరించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుంచు కృష్ణను దా స్యం సన్మానించారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్, కార్పొరేటర్లు సంక నర్సింగరావు, ఇండ్ల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, బీఆర్ఎస్ నాయకులు నార్లగిరి రమేశ్, బుర్ర జనార్దన్, శిరుమల్ల దశరథం, సుంచు కృష్ణ, పీ.సురేశ్‌కుమార్(కాంట్రాక్టర్), పులి రజనీకాంత్, పొలిపెల్లి రాంమూర్తి, గబ్బెట శ్రీనివాస్, శివకుమార్, కాటాపురం రాజు, మహ్మద్ సోనీ, తేలు సారంగసాణి, బస్వ యాదగిరి, సుంచు అశోక్, దువ్వ కనుకరాజు, రంజిత్‌కుమార్, గ్యాస్ రవి తదితరులు పాల్గొన్నారు.