దళిత బహుజనులకు సహకారమందిస్తా..
దళిత బహుజనులకు అనునిత్యం సహకారమందిస్తానని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) ఉమ్మడి వరంగల్ జిల్లా 11వ మహాసభలు సోమవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ అధ్యక్షతన నిర్వహించారు.
- మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
హనుమకొండ, జూలై 6 : దళిత బహుజనులకు అనునిత్యం సహకారమందిస్తానని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) ఉమ్మడి వరంగల్ జిల్లా 11వ మహాసభలు సోమవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన దాస్యం మాట్లాడుతూ వరంగల్ నగరంలోని చెరబండరాజు కాలనీలో ద ళితుల ఇండ్లను ప్రభుత్వం కూల్చివేస్తూ దాడులకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో నగరంలో 5,500 మంది పేదలకు పట్టాలివ్వగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు వారి గుడిసెలను తొలగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బహుజనుల హకుల కోసం డీబీఎఫ్ పోరాడుతున్నదన్నారు. భారత రా జ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ ఆలోచనా విధానమే అత్యుత్తమైన, ఆచరణీయమైనదని, దానిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పీ శంకర్ మాట్లాడుతూ బుద్ధుడు, మహాత్మ జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి, అంబేదర్, రమాబాయి తదితర మహనీయుల బాటలో నడుస్తూ అణగారిన వర్గాల విముక్తి, రాజ్యాధికారం కోసం పని చేయాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒకరూ ఐక్యంగా ఉద్యమించాలన్నారు.
పేదల కడుపు కొడుతూ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అంబేదర్ అందించిన ఓటు హకును సర్ పేరుతో తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, రాష్ట్ర నాయకులు రౌతు రమేశ్, మంద వీరస్వామి, రాంచందర్, భిక్షపతి, రాజేందర్, టీఎమ్మార్పీఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్, మహాత్మ జ్యోతిరావు పూలే సంఘం రాష్ట్ర నాయకుడు కేడల ప్రసాద్, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ మాదాసి సురేశ్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

