హనుమకొండ చౌరస్తా, మే 1: కార్మికుల హక్కుల కోసం పోరాడుతానని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మేడే సందర్భంగా లష్కర్ బజార్ వద్ద హమాలీలు, ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జెండా విష్కరణ కార్యక్రమంలో పాల్గొని జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కార్మిక శాఖ పరిధిలో 4 వేల ఇన్సూరెన్స్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై అధికారులు స్పందించాలన్నారు. పని ప్రదేశాల్లో కార్మికులకు కావాల్సిన వసతులను యాజమాన్యాలు కల్పించాలి, వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. మే నెల మొత్తం కార్మికుల కోసం కార్మిక మాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు.
కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించనున్నామని చెప్పారు. ఎందరో కార్మిక సోదరులు పోరాటాలు, ప్రాణ త్యాగాల ఫలితంగా కార్మికులకు కొన్ని హక్కులు సిద్ధించాయి. ఆ హక్కులను కాపాడుకుంటూ..ఇంకా న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడుతామన్నారు. భవన నిర్మాణ, అనుబంధం రంగాల వారు..బోర్డు పరిధిలో సభ్యత్వం తీసుకొని లబ్ధి పొందే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్మికుల కోసం నిరంతరం పని చేస్తానని స్పష్టం చేశారు.
నా కోరికల్లా కార్మికుల పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలన్నారు. కార్మికుల పిల్లల చదువులకు నా సహాయసహకారాలు ఎల్పడుడూ ఉంటాయని హామీనిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గొర్రె విజయ్ కుమార్, నన్నెబోయిన రవి, మ్యాదరబోయిన రమేష్, రవి, కృష్ణయ్య, నయీమొద్దీన్, ఎన్ఐటీ హరి, చాగంటి రమేష్, ఎంజాల మల్లేశం, నాయిని రవి, కొలిపాక లింగయ్య, గండ్రి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.