హనుమకొండ చౌరస్తా, జనవరి 13: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు జనసేనపార్టీ రాష్ర్ట నాయకుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల ఇంచార్జి మాదిరెడ్డి దామోదర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న జనసేన పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతిబింబించేలా ముందుకు సాగుతుందన్నారు. ప్రజలకు జవాబుదారీతనం కలిగిన పాలన అందించడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని, గెలుపే లక్ష్యంగా జనసైనికులు పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
సమావేశంలో పార్టీ యువజన విభాగం రాష్ర్ట అడ్హాక్ కమిటీ సభ్యుడు గాదె పృథ్వీ యువజన నాయకులు, ఆంజినేయులుగౌడ్, నర్సంపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జి శివకోటి యాదవ్, గడ్డం రాకేష్, శేషాద్రి సందీప్, సనత్‌కుమార్, బర్ల శివ, ముస్కు రమేష్, కొలిపాక వంశీకృష్ణ, ప్రదీప్,రవితేజ, ఎండి.అసిఫ్, బైరి వంశీ, తాళ్లపెల్లి బాలుగౌడ్, జన్ను ప్రవీణ్, సంతోష్, ఓర్సు రాజేందర్, డేవిడ్, స్వర్గం హరిదర్, కొల్లూరి అనుదీప్, షేక్ ఆన్సర్, ఇల్లందుల రాజు, జీవన్ పాల్గొన్నారు.