వరంగల్ చౌరస్తా: కశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దుర్ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఏఆర్ అడ్మిన్ ఏసీపీ అంతయ్య అన్నారు. శనివారం ఉదయం ట్రైసిటీ రైడర్స్, ఏజే పైడిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ నుంచి నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మీ దుస్తుల్లో వచ్చిన నరరూప రాక్షసులైన టెర్రరిస్టులు హిందూ టూరిస్టులను టార్గెట్ చేస్తూ 28 మంది ప్రాణాలను తీసిన ఘటనను దేశం మొత్తం ఖండిస్తున్నదని చెప్పారు. ఈ ఘటనకు పాల్పడిన ముష్కరులను తగిన విధంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా దోషులను పట్టుకొని మరణశిక్ష విధించాలన్నారు.
ఇలాంటి ఆపత్కాల సందర్భంలో భారతీయులందరం ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి పాకిస్తాన్ దేశం సృష్టిస్తున్న మారణహోమాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ కి మీదుగా భద్రకాళి గుడి వరకు వెళ్లి తిరిగి పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మట్టేవాడ ఇన్స్పెక్టర్ గోపి, ట్రైసిటీ రైడర్స్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జయరాజ్, విద్యాసాగర్, ఏ.జే పెడల్స్ అధినేత జయంత్, కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.