ఐనవోలు, జూలై 11: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కరంట్ షాక్ తప్పదని, రైతులు బాగుపడుతుంటే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మొన్న ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తానన్నాడు.. ఇప్పుడేమో సాగుకు మూడు గంటలే కరెంట్ ఇవ్వాలంటున్నాడని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర రైతాంగం కరంట్ షాక్ పెట్టబోతుందన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యాలకు నిరసనగా మండల కేంద్రంలో రైతుబంధు సమితి కోఆర్డినేటర్ మునిగాల సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉండడం చూడలేని రేవంత్‌రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ ఉస్మాన్అలీ, వైస్ ఎంపీపీ మోహన్, ఆలయ కమిటీ చైర్మన్ జయపాల్, మండల కోఆప్షన్ గుంషావళి, మండల అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, నియోజకవర్గ అధికార ప్రతినిధి రవీందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు దేవేందర్, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు సోమేశ్వర్రావు, స్థానిక సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ కల్పన, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలి
ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. దేవన్నపేటలో ఈనెల 19న మంత్రి సత్యవతి రాథోడ్ రూ.10 కోట్ల వ్యయంతో ట్రైబల్ వెల్ఫేర్ భవన ప్రారంభం, అదనపు గదులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపైన చింతగట్టులో 65 డివిజన్ సమన్వయ కమిటీ సభ్యులతో మంగళవారం ఎమ్మెల్యే సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 65వ డివిజన్లో మంత్రి పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారన్నారు. అలాగే చింతగట్టులోని బీజీఆర్ గార్డెన్లో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. సమావేశంలో కార్పొరేటర్ దివ్యరాణీ రాజూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్‌కుమార్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఏరుకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పుట్ట శంకర్, ఆత్మ డైరెక్టర్ భూపాల్పాల్ గౌడ్, వివిధ గ్రామాల అధ్యక్షులు దోమల శ్రీనివాస్, రాజు, రాజేందర్, యువరాజు, నాయకులు మల్లేశం, నాగరాజు, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.