కాశీబుగ్గ, జూన్ 21: వరంగల్ ఎంజీఎం దవాఖానలో మళ్లీ కరెంట్ అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు, అటెండెంట్లు, వైద్యులు ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
జనరల్ ఓపీ, క్యాజువాలిటీ వార్డుల్లో ఎక్స్‌రే, స్కానింగ్, రక్త పరీక్షలు ఆలస్యమయ్యాయి. దీంతో రోగులు ఆరుబయట చాలా సమయం వేచి ఉన్నారు. మధ్యమధ్యలో చాలా సార్లు విద్యుత్‌కు అంతరాయం కలుగుతుండడంతో కరెంట్‌తో చేసే సేవలు నిలిచిపోతున్నాయని దవాఖాన సిబ్బంది వాపోయారు. దవాఖానకు వచ్చిన రోగుల వైద్య పరీక్షలు, ఇతర రిపోర్ట్స్ అందక నిరాశతో మరుసటి రోజు వచ్చేందుకు వెనుదిరిగారు.