పప్పు ధాన్యాల పంటల సాగు మేలు
వరి, వాణిజ్య పంటలతోపాటు పప్పు ధాన్యాలు సాగు చేస్తేనే రైతులకు మేలని జేడీఏ ఉషాదయాళ్ సూచించారు. మండలకేంద్రంలో రైతు ఎండీ గౌస్ ఎన్ఎస్ఎఫ్ఎం పథకంలో ఉచితంగా విత్తనాలు తీసుకొని కంది పంట సాగు చేశాడు. ఎన్ఎస్ఎఫ్ఎం కన్సల్టెంట్ సారంగం, ఏవో రాంనర్సయ్యతో కలిసి మంగళవారం ఆమె పంటను పరిశీలించారు. రైతులు వరి, పత్తి, మిర్చి పంటలపైనే ఆధారపడితే వాతావరణం సకహకరించని సమయంలో ఆర్థికంగా నష్టపోయే
- వాణిజ్య పంటలపైనే ఆధారపడొద్దు
- పురుగు నివారణకు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి
- యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి : జేడీఏ ఉషాదయాళ్
వర్ధన్నపేట, సెప్టెంబర్ 13: వరి, వాణిజ్య పంటలతోపాటు పప్పు ధాన్యాలు సాగు చేస్తేనే రైతులకు మేలని జేడీఏ ఉషాదయాళ్ సూచించారు. మండలకేంద్రంలో రైతు ఎండీ గౌస్ ఎన్ఎస్ఎఫ్ఎం పథకంలో ఉచితంగా విత్తనాలు తీసుకొని కంది పంట సాగు చేశాడు. ఎన్ఎస్ఎఫ్ఎం కన్సల్టెంట్ సారంగం, ఏవో రాంనర్సయ్యతో కలిసి మంగళవారం ఆమె పంటను పరిశీలించారు. రైతులు వరి, పత్తి, మిర్చి పంటలపైనే ఆధారపడితే వాతావరణం సకహకరించని సమయంలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఉషాదయాళ్ సూచించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కంది, పెసర, మినుము పంటలను సాగు చేస్తే మంచి దిగుబడితో ఆర్థిక ప్రగతి సాధించొచ్చని సూచించారు. కంది పంట ఏపుగా పెరిగేందుకు 20 కిలోల యూరియా, 10 కిలోల పోటాష్ వేసుకోవడంతోపాటు 19:19:19 1 కేజీ, 250 గ్రాముల పాలిఫీల్డ్ను కలిపి పిచికారీ చేసుకోవాలని వివరించారు. అలాగే, పచ్చపురుగు, లద్దెపురుగు, పూతదశలో వచ్చే నల్లమచ్చ పురుగుల నివారణ కోసం క్లోరోఫైరిపాస్ 2 ఎంఎల్, 5 ఎంఎల్ వేపనూనెను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కంది సాగు చేయడం వల్ల భూమి సారవంతంగా తయారవుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఏఈవోలు మౌనిక, శరత్, రైతులు పాల్గొన్నారు.
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
రాయపర్తి: రైతులు సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే ఆశించిన దిగుబడి సాధిస్తారని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. ఏవో గుమ్మడి వీరభద్రం నేతృత్వంలో బురహాన్పల్లి, కొండూరులో వరి, పత్తి క్షేత్రాలను ఆమె వ్యవసాయాధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొండూరులో రైతులు సాగు చేసిన అధిక సాంద్రత కలిగిన పత్తి పంట క్షేత్రాలను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వరిలో కాండం తొలుచు పురుగు ఉధృతి, ఎరుపు రోగం ఎక్కువగా కనిపిస్తున్నట్లు చెప్పారు. దీని నివారణకు వ్యవసాయాధికారులు సూచించిన విధంగా పురుగు మందులు పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు వేమిరెడ్డి హిమబిందు, ఉడుత సాయి ప్రసాద్, సర్పంచ్ కర్ర సరితా రవీందర్రెడ్డి, రైతులు ఆవుల రోజారాణి, గుగులోత్ సోమన్న, కర్ర ప్రవీణ్రెడ్డి, పుల్లా ఎల్లాగౌడ్, బాపురెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

